వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్వరలోనే వస్తానన్నాడు: అమెరికాలో మృతి చెందిన వంశీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు

nri, usa, shot dead, mamidala vamshichander reddy, warangal, telangana, ఎన్నారై, అమెరికా, కాల్చివేత, మామిడాల వంశీచందర్ రెడ్డి, వరంగల్, తెలంగాణ

|
Google Oneindia TeluguNews

వరంగల్: త్వరలోనే తిరిగి వస్తానని చెప్పాడని, ఇంతలోనే దారుణం జరిగిందని అమెరికాలోని కాల్పుల్లో మరణించిన తెలంగాణ విద్యార్థి మామిడాల వంశీచందర్ రెడ్డి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. రెండు రోజు క్రితం తనతో ఫోన్‌లో మాట్లాడాడని, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం దొరకడం కష్టంగా ఉందని చెప్పాడని, దాంతో తిరిగి వచ్చేయాలని చెప్పానని, పెళ్లి చేసుకోవాలని అడిగామని, త్వరలోనే తిరిగి వస్తానని చెప్పాడని, ఇంత దారుణం జరగుతుందని అనుకోలేదని వంశీ తండ్రి సంజీవ రెడ్డి అన్నారు.

దారుణం: అమెరికాలో వరంగల్ విద్యార్థి కాల్చివేతదారుణం: అమెరికాలో వరంగల్ విద్యార్థి కాల్చివేత

వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌కు చెందిన 26 ఏళ్ల వంశీ అమెరికాలో దుండగుడి కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. లోకల్ స్టోర్‌లో పనిచేసి తిరిగి వెళ్తుండగా భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్‌లోని మిల్పిటాస్‌లో మరణించాడు.

Vamshi Chander Reddy

మామిడాల వంశీచందర్ రెడ్డి సంజీవ రెడ్డి, రమాదేవిల చిన్న కుమారుడు. 2013లో కాలిఫోర్నియా వెళ్లి సిలికాన్ వ్యాలీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఓ స్టోర్‌లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. వంశీ మిత్రులు శనివారం తమకు ఫోన్ చేసి అతను కనిపించడం లేదని చెప్పారని, ఆ తర్వాత తమ కుమారుడిని కాల్చి చంపినట్లు తెలిపారని వంశీ తండ్రి సంజీవ రెడ్డి వన్ ఇండియా తెలుగు ప్రతినిధికి చెప్పారు.

తన కుమారుడి శవాన్ని తెప్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని సంజీవ రెడ్డి కోరారు. పదో తరగతి వరకు వంశీ స్థానిక ప్రైవేట్ స్కూల్లో చదివాడు. భువనగిరిలోని అమెరికాలోని భువనగిరిలో బిటెక్ పూర్తి చేశాడు. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్థులు వంశీచందర్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద యెత్తున గుమికూడారు. వారంతా విషాద సముద్రంలో మునిగిపోయారు.

వంశీ విషయంలో ఇంత దారుణం జరుగుతుందని అనుకోలేదని విజయ్ కుమార్ అనే పొరుగు వ్యక్తి అన్నారు వంశీ మంచి స్వభావం గలవాడని, తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడని, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి అమెరికాలో చదువు కోసం వెళ్లాడని చెప్పారు.

స్థానిక శాసనసభ్యుడు ఆరూరి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వంశీ మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా తెప్పించడదానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు.

English summary
Youngster aged 26 Mamidala Vamshi Chander Reddy from Vangapahad in Hasanparthy mandal of Warangal-Urban District of Telangana State was shot-dead while he was coming back after completing his shift at a local store where he was working part time at Milpitas County of California State in United States of America on Saturday morning as per Indian standard time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X