కుకునూర్‌పల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య వెనుకున్న అసలు కథ ఇదీ

హైదరాబాద్: మెదక్ జిల్లా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కుకునూర్‌పల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి(38) పోలీసు విభాగంలో ఇమడ లేకపోయారని విచారణాధికారి ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. వివరాల్లోకి వెళితే... కుకునూర్‌పల్లి ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పోలీస్‌ క్వార్టర్స్‌లో తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పోలీసులకు క్వార్ట‌ర్స్‌లో సూసైడ్‌ నోట్ దొరకడంతో రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. దీంతో రామ‌కృష్ణారెడ్డి ఆత్మ‌హ‌త్య‌పై విచార‌ణ చేప‌ట్టిన అధికారి ప్రతాప్‌రెడ్డి శుక్రవారం మీడియాకు ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు.

ఆర్మీ నుంచి వచ్చిన రామకృష్ణారెడ్డి పోలీసు విభాగంలో చేరడంతో చదువు అంతంత మాత్రమే కావడంతో విధి నిర్వహణలో ఇబ్బంది పడ్డారని ఆయన తెలిపారు. వాటికి తోడు ఎస్‌ఐకి కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మ‌ద్యం మ‌త్తులో విచ‌క్ష‌ణ కోల్పోయి కాల్చుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడని ఆయన పేర్కొన్నారు.

 He was being forced to collect bribes: Family of Telangana SI who killed himself

రామకృష్ణారెడ్డి మృతిపై విచారణ జరిపిన ఆయన ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నారు. సూసైడ్ నోట్‌లో తన ఆత్మహత్యకు డీఎస్పీ, ఇద్దరు సీఐల వేధింపులే కారణమని రామకృష్ణా రెడ్డి తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. నెలకు రూ. 15 లక్షలు మామూళ్లను డీఎస్పీకి పంపుతున్నానని, అయినా తనను వేధింపులకు గురిచేస్తున్నారని అందులో వెల్లడించారు.

కాగా, ఈ ఆరోపణల నేపథ్యంలో డీఎస్పీ శ్రీధర్ స్పందించారు. ఆత్మహత్యకు పాల్పడిన రామకృష్ణపై ఓ అవినీతి కేసు పెండింగ్‌లో ఉందని చెప్పారు. వాహన ప్రమాదం, కేసును తప్పుదోవ పట్టించడంపై కేసులున్నాయని తెలిపారు. ఈ కేసుపై 15రోజుల క్రితమే తాను విచారణ ప్రారంభించామని చెప్పారు.

ఈ విచారణ నేపథ్యంలోనే ఆందోళన చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుకోవచ్చని, తాను అందుకు సహకరిస్తానని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం బక్కమంత్రగూడెంకు చెందిన ఇస్తాల అంతిరెడ్డి, లక్ష్మమ్మది వ్యవసాయ కుటుంబం.

వీరిద్దరి కుమారులు ప్రభుత్వ ఉద్యోగులు. మూడో కుమారుడు రామకృష్ణారెడ్డి దాదాపు పదేళ్లపాటు ఆర్మీలో పనిచేశారు. సరిహద్దుల్లో కాల్పుల్లో కాలుకు తీవ్ర గాయమవడంతో పదవీ విరమణ చేశారు. దీంతో 2006-07లో డిగ్రీ పూర్తిచేశాక రాష్ట్ర ప్రభుత్వం ఎస్సైగా ఉద్యోగాన్ని కేటాయించడంతో హైదరాబాద్‌లోని లక్డీకాపూల్, సుల్తాన్‌బజార్‌లలో పనిచేశారు.

ఆ తర్వాత బదిలీపై మెదక్ జిల్లాలోని గజ్వేల్‌కు, తొగుటకు, రెండేండ్ల కిందట కుకునూర్‌పల్లి ఎస్‌ఐగా బదిలీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+