తెలంగాణకు హైకోర్టు మళ్లీ మొట్టికాయ, భేష్.. కెటిఆర్‌ను చూసి ముగ్ధుడైన కేంద్రమంత్రి

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా, గ్రేటర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రభుత్వం ఎక్స్ అఫిషియో చట్టానికి మార్పులు చేయడంపై హైకోర్టు మొట్టికాయలు వేసింది.

గ్రేటర్ హైదరాబాదులో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రభుత్వం ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటును కూడా చేర్చింది. దీనిపై ఓ పిటిషన్ దాఖలైంది. గురువారం నాడు దీనిపై విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున న్యాయవాది (ఏజీ)కి హైకోర్టు మొట్టికాయలు వేసింది.

Cartoon : Poll violence in GHMC

Hearing on ex officio GHMC members today

విచారణలో భాగంగా ఏజీ మాట్లాడుతూ... చట్టాన్ని సవరించే అధికారం ప్రభుత్వానికే ఉందన్నారు. రెండేళ్ల వరకూ ప్రభుత్వమే చట్టాన్ని సవరించుకోవచ్చన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఈ వెసులుబాటు ఉందని న్యాయస్థానానికి తెలిపారు.

అయితే చట్టాన్ని సవరించుకునే అధికారం ప్రభుత్వానికి ఒక్కసారి మాత్రమే ఉందని పిటిషనర్లు వాదించారు. ఒకసారి సవరించాక.. మరోసారి సవరించాలంటే చట్టసభల్లో ఆమోదించాల్సిందేనని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కేసుపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.

Hearing on ex officio GHMC members today

కెటిఆర్‌కు కేంద్రమంత్రి ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై రాష్ట్రానికి చెందిన బిజెపి నేతలు ప్రజాప్రతినిధులు విమర్శలు చేస్తుంటే.. కేంద్రమంత్రి మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేంద్రమంత్రి వీరేంద్ర సింగ్.. కెటిఆర్ వాటర్ గ్రిడ్ పైన ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి ముగ్ధుడయ్యారు.

Hearing on ex officio GHMC members today

బుధవారం నాడు ముంబైలో జరిగిన సమావేశంలో వాటర్ గ్రిడ్ పైన తాను స్వయంగా తయారు చేసిన పవర్ పాయింట్ ప్రదర్శనను ఆయన నేతల ముందు ఉంచారు. దానిని చూసిన అందరూ మెచ్చుకున్నారు. కరువు ప్రాంతాల్లో ఈ తరహా పథకాలు నీటి కొరతను తీరుస్తాయని కేంద్రమంత్రి అన్నారు. కెటిఆర్‌కు భాష పైన మంచి పట్టుందని, అనుకున్న దాని కంటే స్పష్టంగా చెప్పగలనని నిరూపించారని, చేసి చూపిస్తారని భావిస్తున్నానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+