అయ్యో పాపం.. అమెరికా వీసా రాలేదని..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక వీసాల జారీ విషయంలో పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉన్న రూల్స్ ను మరింత కఠినతరం చేశారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA)లో భాగంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే యువతపై పలు ఆంక్షలు విధించారు. అయితే తాజాగా హైదరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. అమెరికా వీసా రాలేదని యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. అమెరికా వెళ్లి మంచిగా స్థిరపడాలని భావించిన ఆ యువతి కలలు ఛిద్రం అయ్యాయి. ఆ యువ వైద్యురాలి వీసాను అమెరికా ప్రభుత్వం చాలా సార్లు రిజెక్ట్ చేసింది. ఇటీవల మరోసారి అప్లై చేసింది. ఈసారి కూడా వీసా రిజెక్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన డాక్టర్ రోహిణి గత కొంతకాలంగా హైదరాబాద్ లో నివసిస్తోంది. అయితే చాలాకాలంగా ఆమె అమెరికా వీసాకు అప్లై చేస్తూ వస్తోంది. అయితే ఇటీవలి కాలంలో అక్కడి ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో J1 వీసా రాలేదు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన డాక్టర్ రోహిణి.. నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకుంది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాల్సిన తమ కుమార్తె.. ఇలా మృతి చెందడంపై ఆ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఇక రోహిణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యాక తమ స్వస్థలం గుంటూరుకు తరలించారు.












Click it and Unblock the Notifications