Heatwaves: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. రాబోయే రెండు రోజులు జాగ్రత్తగా ఉండండి..!

తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో వడగాలు వీచే అవకాశం ఉండడంతో హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అరెంజ్ (తీవ్రమైన వేడిగాలులు) హెచ్చరికలు జారీ చేసింది.

The India Meteorological Department has said that heat winds are likely to blow in Telangana for the next two days

ఎక్కువ సేపు ఎండలో ఉండడం లేదా ఎండకు ఎక్కువగా పనులు చేసేవారిలో హీట్‌ ఇల్‌సింక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు పగటి పూట బయటకు రావొద్దని కోరింది. సాదారణ ప్రజలు కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు బయటకు రావొద్దని సూచించింది.

" నీరు ఎక్కువగా తీసుకోవాలి. ORS, ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, తోరణి (బియ్యం నీరు), నిమ్మకాయ నీరు, మజ్జిగ తాగితే మంచిది "అని ఒక వైద్య అధికారి తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వేడిగాలులు, ఆదిలాబాద్, హనుమకొండ, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లో కొన్నిచోట్ల వేడిగాలులు వీచాయి.

పెద్దపల్లిలోని ఈసాల తక్కలపల్లి అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జమ్నుగ, పెద్దపల్లి జిల్లా పాలెంలో 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జూన్ 20న, వాతావరణ శాఖ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ (హీట్ వేవ్) జారీ చేసింది.

ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40-43 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+