ఆ 2బ్యాంకులకే డబ్బులందుతున్నాయి: బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులపై ఒత్తిడి తీవ్రంగా పెరిగిందని బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులపై ఒత్తిడి తీవ్రంగా పెరిగిందని బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి రోజు 14 నుంచి 18గంటలపాటు పని చేయాల్సి వస్తోందని వాపోయింది.

అంతేగాక, భారత రిజర్వు బ్యాంక్ నుంచి అన్ని బ్యాంకులకు డబ్బులు రావడం లేదని ఆరోపించింది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు మాత్రమే ఆర్బీఐ డబ్బులను పంపిస్తోందని పేర్కొంది.
ఈ క్రమంలోనే 2లక్షల ఏటీఎంలకు గానూ 35వేల ఏటీఎంలే పని చేస్తున్నాయని స్పస్టం చేసింది. ఆర్బీఐ అన్ని బ్యాంకులకు డబ్బులను పంపిణీ చేయాలని కోరింది. అన్ని బ్యాంకులకు డబ్బులు అందితే.. ఖాతాదారులకు అందించడంలో తమకేమీ ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications