భారీ వర్షంతో సంద్రంలా హైదరాబాద్: కార్లు, బైక్లు కొట్టుకుపోయాయి, చిన్నారి మృతిపై తలసాని

హైదరాబాద్: నగరంలో శనివారం తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రెండు రోజులపాటు ఎడతెరిపినిచ్చిన వాన.. కుండపోతగా దంచికొట్టింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి. రహదారులు వరదనీటితో నిండిపోయి చిన్నపాటి నదులుగా మారాయి. దీంతో నగర ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ భారీ వర్షం, వరదలు.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి మరణించడం శోచనీయం.

ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్, ముషీరాబాద్, అడిక్ మెంట్, కవాడిగూడా, భోలక్‌పూర్, గాంధీనగర్ డివిజన్లలోని కాలనీ, బస్తీల్లో మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచాయి. మరోవైపు, పలు నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీటిలో కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, రాంనగర్, తదితర ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. చిలకానగర్ లోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.

Heavy rain lashes in Hyderabad: cars and bike washed away, on girl killed

ఖైరతాబాద్‌లోని మింట్ కాంపౌండ్ రహదారి, ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్, ఖైరతాబాద్ ప్రధాన రహదారిలోని మెట్రో స్టేషన్ వద్ద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో శనివారం మధ్యాహ్నం వరకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ వరద నీరు నిలిచిపోవడంతో నగరవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమయానికి అధికారులు స్పందించకపోవడంపై మండిపడుతున్నారు.

నాలాలో పడి చిన్నారి మృతి: సికింద్రాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి కళాసిగూడలోని మ్యాన్ హోల్ మూత కొంతమేర తెరిచి ఉండటంతో ఓ 11ఏళ్ల చిన్నారి అందులో పడి ప్రాణాలు కోల్పోయింది. స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న మౌనిక అనే బాలిక ఉదయం పాల ప్యాకేట్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే, రోడ్డుపై వెళ్తుండగా తెరిచి ఉన్న మ్యాన్ హోల్‌లో పడిపోయింది.

వరదనీరు ఉండటంతో చిన్నారి మ్యాన్ హోల్ గమనించలేకపోయింది. కాగా, పార్క్ లేన్ వద్ద పాప మృతదేహాన్ని డీఆర్ఎఫ్ సిబ్బంది బయటికి తీశారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి మరణించిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిన్నారి కుటుంబానికి అండగా ఉంటామన్న మంత్రి తలసాని: నాలాలో పడి చిన్నారి మౌనిక మృతి చెందడం బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ప్రభుత్వం ప్రజల క్షేమం కోసం నిరంతరాయంగా పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే జరిగిందనడం సరికాదన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. 5వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. చిన్నారి నాలాలో మునిగిపోతుంటే కొందరు నిల్చుని చూశారు తప్ప.. ఆమెను కాపాడేందుకు ఎవరూ ప్రయత్నించలేదని మండిపడ్డారు. రూ. 5 లక్షల పరిహారం అందజేస్తామన్నారు. చిన్నారి మృతిని రాజకీయం చేయడం సరికాదన్నారు. ప్రతిపక్షాల విమర్శలపై మండిపడ్డారు.

అంతకుముందు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. చిన్నారి నాలాలో కొట్టుకుపోయిన స్థలాన్ని పరిశీలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్నారి కుటుంబానికి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. మరోవైపు, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులపై వేటు వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+