హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TSఅలర్ట్: రాబోయే 48 గం. భారీ వర్షాలు -IMD వార్నింగ్ -Hyderabad లో 70 శాతం అధికంగా వ‌ర్ష‌పాతం

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటికే అధిక వర్షపాతం నమోదైనా, కుంభవృష్టి ఆగేలా లేదు. రాష్ట్రంలో గడిచిన మూడు రోజులుగా వానలు దంచికొడుతుండగా, రాగ‌ల 48 గంట‌ల్లో మరిన్ని భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. విశ్వనగరం హైద‌రాబాద్, దాని ప‌రిస‌ర ప్రాంతాల‌తోపాటు రాష్ర్ట వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

Recommended Video

Weather Update : Five Days Continuous Heavy Rains In Telangana | Oneindia Telugu

సింగర్ మంగ్లీపై పోలీసులకు బీజేపీ ఫిర్యాదు -రాచకొండ పోలీసుల యాక్షన్? -నా జాతి, ప్రాంతంపై విమర్శలా?సింగర్ మంగ్లీపై పోలీసులకు బీజేపీ ఫిర్యాదు -రాచకొండ పోలీసుల యాక్షన్? -నా జాతి, ప్రాంతంపై విమర్శలా?

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతోపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపుల అలజడి ఉంటుందని, 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చ‌రించారు. హైద‌రాబాద్‌లో బుధ‌వారం తెల్ల‌వారుజాము నుంచే వాన కురుస్తున్నది. ఉప్ప‌ల్, అల్వాల్, రాజేంద్ర‌న‌గ‌ర్, కార్వాన్ ఏరియాల్లో ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు 0.5 మి.మీ. నుంచి 2 మి.మీ. మ‌ధ్య వ‌ర్ష‌పాతం న‌మోదైంది. బాచుప‌ల్లిలో ఉద‌యం 10 గంట‌ల‌కు భారీ వ‌ర్షం కురిసింది.

 Heavy rainfall likely for next 48 hours Telangana, warns hyderabad imd, surplus rainfall

తెలంగాణలో చురుకుగా ఉన్న నైరుతి రుతుపవనాలు ఇప్పటివరకు అధిక వర్షాన్ని కురిపించాయని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్) గణాంకాల్లో వెల్లడైంది. జూన్ 1 మరియు జూలై 20 మధ్య కాలంలో సాధారణ వర్షపాతం 273 మిమీ కాగా, ఈ ఏడాది 405.3 మిమీ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు అధికంగా ఉన్నందున, ఒక్క జిల్లాలోనూ వర్షాభావ పరిస్థితులు లేవు. 33 జిల్లాల్లో 15 అధిక వర్షపాతం నమోదైందని (టీఎస్డీపీఎస్) పేర్కంది. ఇక

సింగరేణిపై సీఎం కేసీఆర్ సంచలనం -కార్మికుల రిటైర్మెంట్ వయసు 61కి పెంపు -ఎన్నికల్లో కవిత vs సీతక్క?సింగరేణిపై సీఎం కేసీఆర్ సంచలనం -కార్మికుల రిటైర్మెంట్ వయసు 61కి పెంపు -ఎన్నికల్లో కవిత vs సీతక్క?

హైద‌రాబాద్‌ న‌గ‌రంలో ఈ ఏడాది జులై 20 నాటికి సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోదైందని, మంగళవారం నాటికే న‌గ‌రంలో 70 శాతం అధికంగా వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్ల తెలంగాణ స్టేట్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్ల‌డించింది. జులై 20వ తేదీ వ‌ర‌కు 359.5 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు అయింది. ఈ తేదీ వ‌ర‌కు సాధార‌ణ వ‌ర్ష‌పాతం 210.9 మి.మీ. మాత్ర‌మే. ఐఎండీ డాటా ప్ర‌కారం.. జులైలో నెల‌లో 285.2 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా, గ‌త ప‌దేళ్ల‌లో ఇదే అత్య‌ధిక‌మ‌ని వెల్ల‌డించింది. అటు

కోల్ బెల్ట్ ఏరియాలో వానలు దంచికొడుతుండటంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడ్డాయి. మంచిర్యాల‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల్లో బుధ‌వారం ఉద‌యం భారీ వ‌ర్షం కురుస్తుండటంతో ఓపెన్ కాస్ట గనుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. మంచిర్యాల ప‌రిధిలో కేకే, ఆర్‌కేపీ, ఎస్ఆర్పీ, ఇందారం ఉప‌రిత‌ల గ‌నుల్లో ఉత్ప‌త్తికి ఆటంకం క‌లిగింది. దాదాపు 32 వేల ట‌న్నుల బొగ్గు ఉత్ప‌త్తికి అంత‌రాయం ఏర్ప‌డింది.

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని ఇల్లందు, పిన‌పాకలో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షం కురుస్తోంది. వ‌ర్షంతో ఇల్లందు, కోయ‌గూడెం ఉప‌రిత‌ల గ‌నుల్లో ప‌నుల‌కు ఆటంకం ఏర్ప‌డింది. 8 వేల ట‌న్నుల బొగ్గు ఉత్ప‌త్తికి అంత‌రాయం ఏర్ప‌డింది. 28 వేల క్యూబిక్ మీట‌ర్ల మ‌ట్టి వెలికితీత‌కు అంతరాయం క‌లిగింది. పినపాక నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌ణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, క‌ర‌క‌గూడెం, గుండాల‌, ఆల‌పెల్లిలో భారీ వ‌ర్షం కురిసింది. మ‌ణుగూరు ఉప‌రిత‌ల గ‌నుల్లో ఓవ‌ర్ బ‌ర్డెన్ ప‌నుల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. భ‌ద్రాద్రి విద్యుత్ ప్లాంట్ 4వ యూనిట్ సివిల్ వెల్డింగ్ ప‌నుల‌కు ఆటంకం క‌లిగింది.

English summary
The Meteorological centre, Hyderabad has forecast Heavy rainfall likely in telangana for coming 48 hours. IMD said widespread rains in the surrounding areas of Hyderabad as well as across the state. Chance of light rain with thunder and lightning in many places. Authorities warned that strong winds of 30 to 40 kmph were expected and that people should be alert. The southwest monsoon active over Telangana has brought in surplus rains so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X