వర్షంలో బండి ఆగిందా, కాల్ చేయండి - హైదరాబాద్ లో వర్షం అప్డేట్స్..!!

హైదరాబాద్ ను వర్షం వీడటం లేదు. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్‌లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వర్షాలకు వాహనాలపై బయటికి అత్యవసర పని మీద వెళ్లిన జనాలు, ఆఫీసుల నుంచి ఇంటికెళ్లే మార్గమధ్యలో వర్షానికి ఇరుక్కుపోయిన వాహనదారులకు సైబరాబాద్ పోలీసులు కీలక సమాచారం ఇచ్చారు.

నగరంలో భారీ వర్షం:హైదరాబాద్ లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నగరంలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Heavy Rains alert for Hyderabad City, CS Santhi Kumari directions for officials

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నడిరోడ్డుపై వాహనాలు మొరాయిస్తే, ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కరించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. ఇకపై వర్షానికి బండి ఆగిపోతే వెంటనే 83339 93360 నెంబర్‌కు వాట్సప్ కాల్ చేస్తే సైబరాబాద్ పోలీసులు సహాయం చేస్తారు. ఇది సైబరాబాద్ కమిషనరేట్ పరిధి వరకు మాత్రమేనని పోలీసులు స్పష్టం చేశారు.

సాయం కోసం సంప్రదించండి:భారీ వర్షాల వేళ సైబరాబాద్ పోలీసులు సాయం కోసం సంప్రదించాల్సిన నెంబర్లను ప్రకటించారు. మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ : 87126 63011, 87126 63010 ను సంప్రదించాలని సూచించారు. సైబరాబాద్ పోలీసులు వాట్సప్ నంబరు : 9490617346 ను సంప్రదించాలని సైబరాబాద్ పోలసులు కోరారు. ఇదే సమయంలో తెలంగాణలో భారీ వర్షాలపై సీఎస్ శాంతి కుమారి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఆమె అధికార యంత్రాగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈ 48 గంటల పాటు అత్యంత అప్రమత్తతతో ఉండాలని సీఎస్ ఆదేశించారు. ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని తెలిపారు.

అప్రమత్తంగా ఉండండి:తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసారు. ఇక ఈ రెండు రోజుల్లో కురిసే అత్యంత భారీ వర్షాల వల్ల అవి మరింత ప్రమాద స్థాయిలో ప్రవహించే అవకాశముంది. నిండిన ప్రతీ చెరువు వద్ద, ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న కాజ్- వే ల వద్ద ప్రత్యేక అధికారులతో పాటు పోలీస్ అధికారులను నియమించి తగు జాగ్రత్త చర్యలను చేపట్టాలని అధికారులకు సీఎస్ సూచించారు. లోతట్టు ప్రాంతాలు, ముంపునకు గురయ్యే ప్రాంతాలలో అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. గుర్తించిన పునరావాస కేంద్రాలలో అవసరమైన వస్తు సామాగ్రి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+