వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీవర్షాల ఎఫెక్ట్ : 54రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్యరైల్వే, రైల్వే సిబ్బందికి అలెర్ట్!!

|
Google Oneindia TeluguNews

గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో అలెర్ట్ అయ్యింది. రానున్న రెండు మూడు రోజుల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి అన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో హైదరాబాద్, సికింద్రాబాద్ లను కలుపుతున్న ఎంఎంటీఎస్ రైళ్ళ తో సహా 56 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసినట్టు సమాచారం

భారీ వర్షాల కారణంగా 20 ప్యాసింజర్ రైళ్ళు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

భారీ వర్షాల కారణంగా 20 ప్యాసింజర్ రైళ్ళు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

ఇప్పటి వరకు భారీ వర్షాల కారణంగా దాదాపు 20 ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయబడ్డాయి. వాటిలో 16 ఒక్క హైదరాబాద్ డివిజన్‌లో ఉన్నాయి. నాందేడ్ డివిజన్‌లో రెండు ఉన్నాయి. విజయవాడ డివిజన్‌లో మరో రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మొత్తం 20 ప్యాసింజర్ రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఇక అంతేకాదు సోమవారం నుండి బుధవారం (జూలై 13) వరకు జంటనగరాలను కలిపే 34 ఎంఎంటీఎస్ సర్వీసులు నిలిపివేయబడ్డాయి .

జంట నగరాల మధ్య నడిచే 34 ఎంఎంటీఎస్ సర్వీసులు నిలిపివేత

జంట నగరాల మధ్య నడిచే 34 ఎంఎంటీఎస్ సర్వీసులు నిలిపివేత

ఇవి హైదరాబాద్-లింగంపల్లి మరియు లింగంపల్లి-హైదరాబాద్, ఫలక్‌నుమా-లింగంపల్లి మరియు లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య, సికింద్రాబాద్-లింగంపల్లి మరియు లింగంపల్లి- సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న సర్వీసులని రైల్వే అధికారులు చెబుతున్నారు. లింగంపల్లి-హైదరాబాద్ మధ్య తొమ్మిది రైళ్లు, హైదరాబాద్-లింగంపల్లి మధ్య తొమ్మిది సర్వీసులను రద్దు చేసినట్లు ఎస్‌సీఆర్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఫలక్‌నుమా మరియు లింగంపల్లి మధ్య ఏడు రైళ్లు మరియు లింగంపల్లి మరియు ఫలక్‌నుమా మధ్య ఏడు సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రైల్వే అధికారులు సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య ఒక సర్వీసును, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య ఒక సర్వీసును కూడా రద్దు చేశారు.

దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన రైళ్ళ వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన రైళ్ళ వివరాలివే

అంతేకాదు అదనంగా, దక్షిణ మధ్య రైల్వే జూలై 11 నుండి జూలై 13 వరకు మెయిన్ లైన్ మల్టిపుల్ యూనిట్ (MEMU) సేవలను రద్దు చేసింది. వీటిలో సికింద్రాబాద్ నుండి ఉందానగర్ వరకు సికింద్రాబాద్ ప్యాసింజర్ స్పెషల్, సికింద్రాబాద్ నుండి ఉందానగర్ స్పెషల్, ఉందా నగర్ నుండి సికింద్రాబాద్ రైలు, H.S.నాందేడ్ ప్యాసింజర్, సికింద్రాబాద్ మేడ్చల్ మెము రైలు, మేడ్చల్ సికింద్రాబాద్ మెము రైలు, మేడ్చల్ నుండి ఉందానగర్, సికింద్రాబాద్ మేడ్చల్ మెము రైలు, మేడ్చల్ సికింద్రాబాద్ మెము రైలు, కాకినాడ పోర్టు విశాఖపట్నం మెము రైలు, విజయవాడ బిట్రగుంట మెము రైలును రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

ట్రాక్ లు, వంతెనలపై పటిష్టమైన నిఘా పెట్టాలన్న దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జి జనరల్ మేనేజర్

ట్రాక్ లు, వంతెనలపై పటిష్టమైన నిఘా పెట్టాలన్న దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జి జనరల్ మేనేజర్


భారీ వర్షాల దృష్ట్యా మండల వ్యాప్తంగా డివిజనల్ మేనేజర్లతో ఇన్‌చార్జి జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ డిజిటల్ సమావేశాన్ని నిర్వహించి ట్రాక్‌లు, వంతెనలు వంటి గుర్తించిన అన్ని బలహీన విభాగాల వద్ద పెట్రోలింగ్‌ను పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. సైడ్ వాటర్ డ్రెయిన్‌లు, క్యాచ్ వాటర్ డ్రెయిన్‌లు మరియు వాటర్‌వేలను శుభ్రపరచడం, నిర్వహించడం ద్వారా ట్రాక్‌ల వరదలను నివారించడానికి, రైళ్లు సాఫీగా నడిచేలా చూసుకోవాలని సూచించారు. వాతావరణ హెచ్చరికల నివేదికలను అధికారులు పరిగణలోకి తీసుకోవాలని, నీటిపారుదల శాఖతో అనుసంధానం చేయాలని సూచించారు. వివిధ స్థాయిలలోని సంబంధిత అధికారులందరికీ భారీ వర్షాల జాగ్రత్తలపై బుక్‌లెట్‌ను కూడా అందించినట్టు పేర్కొన్నారు.

English summary
Due to heavy rains, South central Railway has canceled 34 MMTS and 20 passenger trains. A total number of 54 trains in ap and telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X