ఎడతెరిపిలేని వర్షం: హైదరాబాద్‌, ఉత్తర తెలంగాణలో జోరుగా.. రేపు కూడా!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ సహా పెద్దపల్లి, మంచిర్యాల, భూపాల జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో బుధవారం తెల్లవారుజామున 3గం. నుంచి తెరిపినివ్వకుండా వర్షం కురుస్తూనే ఉంది.

వర్ష ప్రభావంతో నగరంలో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎప్పటిలాగే నాలాలు, కాల్వలు వరదనీటితో పొంగిపొర్లుతున్నాయి. రోడ్ల మీదకు భారీగా వరద నీరు చేరడంతో.. మ్యాన్ హోల్స్ భయం వెంటాడుతోంది.

వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు అంబరిపేట్ లో 6సెం.మీ, బండ్లగూడా, ఎల్బీనగర్, నారాయణగుడాలో 5సెం.మీ, ముషీరాబాద్, బాలానగర్, మౌలాలీ, రామచంద్రాపురంలో 2సెం.మీల చొప్పున వర్షం కురిసింది. ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నందునా విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తోంది.

Heavy rains to lash Telangana from today

తెలంగాణతో పాటు ఏపీలోని కొన్నిచోట్ల, రాయలసీమలోను వర్షాలు కరుస్తున్నాయి. గురువారం కూడా రెండు రాష్ట్రాల్లోను విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బుధవారం హైదరబాద్ లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందంటున్నారు.

A Boy Was Washed Away Following Heavy Rain In Hyderabad : Watch Video

ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీమ్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి,జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్ రూరల్&అర్బన్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Some districts in Telangana state and Rayalseema will witness moderate to heavy rainfall on Wednesday, while coastal AP will be lashed by heavy rain on August 9 and 10, the weather bureau has stated.
Please Wait while comments are loading...