హైదరాబాద్ లో వర్ష బీభత్సం - బయటకు రావద్దు, తాజా అలర్ట్..!!
హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. సోమవారం మధ్నాహ్నం నుంచి కురుస్తున్న వర్షంతో నగరం చెరువులా మారింది. పలు ప్రాంతాలు వర్షం నీట మునిగాయి. పలు శివారు ప్రాంతాలు వర్షం నీటి లో చిక్కుకున్నాయి. ఈ తెల్లవారు జాము నుంచి భారీ వర్షం మదొలైంది. ఆగకుండా కురుస్తున్న వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించింది. ఎల్లో అలర్ట్ జారీ అయింది. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కొనసాగనున్నాయి.
చెరువుల్లా రోడ్లు
హైదరాబాద్ భారీ వర్షంతో నదిలా మారింది. పలు ప్రాంతాలు వర్షం నీటిలో చిక్కుకున్నాయి. నగరంలో 10 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేసారు. ఉతయం నుంచి కుండ పోతగా కురుస్తున్న వర్షంతో అత్యవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ నగర ప్రజలను కోరుతోంది. వాహన దారులకు నరకం కనిపిస్తోంది. రాగల నాలుగు గంటపాటు నగర వ్యాప్తంగా కుండపోత వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భాగ్యనగరానికి జీహెచ్ఎంసీ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

కుండపోత వర్షం
వర్షం ధాటికి భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ మళ్లించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అలాగే పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. జీహెచ్ ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. అత్యవసరమైన వారు ఈ టోల్ ఫ్రీ నెంబర్లలో 040-21111111, 9000113667 సంప్రదించాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు. వర్షం ధాటికి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో భాగ్యనగరం అంధకారంలో నెలకొంది.
బయటకు రావద్దు
రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల కూడిన వానలు పడతాయని వెల్లడించింది. ఆగస్ట్ 20వ తేదీ వరకు తెలంగాణలోని అత్యధిక జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా హెచ్చరించింది. హైటెక్ సిటీ నుంచి మాదాపూర్ వరకు రోడ్లు చెరువులా మారాయి. నగరంలో వర్ష బీభత్సంతో శివారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications