వానలకు హైదరాబాద్ నగరం చెరువైంది
ఎడతెరిపి లేని వర్షాల వల్ల హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతంోది. భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్‌కు వరద నీటి ప్రవాహం పెరిగింది. మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వస్తుండటంతో పాటు తాజాగా గురువారం కురిసిన వర్షాల కారణంగా నీటి ఉద్ధృతి మరింత పెరిగింది. కూకట్‌పల్లి, పికెట్ నాలాలతో పాటు దుర్గం చెరువు నుంచి వచ్చే నాలాల వల్ల సాగర్‌లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరటంతో చెరువు దిగువ ప్రాంతాలైన అశోక్‌నగర్, అరుంధతినగర్, గాంధీనగర్, ఫీవర్ ఆసుపత్రి, నల్లకుంట, గోల్నాక ప్రాంతాల ప్రజల్లో క్షణ క్షణం ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications