సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో లాఠీఛార్జ్: మహిళ తల పగిలింది
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం మధ్యాహ్నం రైళ్లలో సీట్ల కోసం ప్రయాణికుల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది.
హైదరాబాద్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా నగర ప్రజలు వారి వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో సికింద్రబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం రైళ్లలో సీట్ల కోసం ప్రయాణికుల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది.

దీంతో రైల్వే పోలీసులు లాఠీ ఛార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, ప్రయాణికుల ఘర్షణలో ఓ మహిళ తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో రైల్వే పోలీసులు ఆమెకు వైద్యం అందించారు.
సంక్రాంతి పండగ సందర్భంగా భారీ ఎత్తున ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. కాగా, ప్రత్యేక రైళ్ల వివరాలు, సమాచారం లేకపోవడం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.












Click it and Unblock the Notifications