హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యేల సిఫార్స్‌తో జనం పరుగులు! వద్దన్నా 'డబుల్' రగడ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జిల్లా కలెక్టర్ కార్యాలయం సోమవారం ప్రజలతో కిక్కిరిసిపోయింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం మహిళలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. సోమవారం ఒక్కరోజే అయిదు వేల దరఖాస్తులు వచ్చాయి. ఇకపై ఇళ్ల కోసం కలెక్టరేట్‌లో దరఖాస్తులు తీసుకోమని, ఆయా బస్తీల్లో వార్డు కమిటీలే అర్హులను గుర్తిస్తారని చెప్పారు.

దరఖాస్తులు తీసుకుంటామంటూ ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోయినా సోమవారం నాంపల్లిలోని హైదరాబాద్‌ కలెక్టరేట్‌కు మహిళలు పోటెత్తారు. చివరకు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా స్వయంగా బయటకు వచ్చి తామే వార్డుల్లోకి వచ్చి దరఖాస్తులు తీసుకుంటామని, అప్పటి వరకు ఎవరూ ఇలా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.

పేద, మధ్యతరగతి మహిళల్లో కనిపిస్తున్న ఈ ఆత్రుతను కొంతమంది దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.50 నుంచి రూ.100 వరకూ వసూలు చేస్తున్నారు. స్థానికంగా చోటామోటా నాయకులు, కార్యకర్తలు దళారులుగా మారి ఈ దందా నిర్వహిస్తున్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లు

డబుల్ బెడ్ రూం ఇళ్లు

వాస్తవానికి దరఖాస్తులు స్వీకరించడానికి రెవెన్యూ సిబ్బందికి ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని తెలుస్తోంది.

డబుల్ బెడ్ రూం ఇళ్లు

డబుల్ బెడ్ రూం ఇళ్లు

అయితే ప్రత్యేకించి సోమవారం నిర్వహించే మీ కోసం కార్యక్రమానికి వస్తున్న దరఖాస్తుల్లో సింహాభాగం ఇళ్ల కోసం వస్తున్నవే కావడం గమనార్హం.

డబుల్ బెడ్ రూం ఇళ్లు

డబుల్ బెడ్ రూం ఇళ్లు

మీ కోసం కార్యక్రమంలో ఇలాంటి దరఖాస్తులూ తీసుకోవాల్సి ఉండటంతో గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రత్యేకంగా కౌంటర్‌ పెట్టి అక్కడ దరఖాస్తుదారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లు

డబుల్ బెడ్ రూం ఇళ్లు

తమ దరఖాస్తులు తీసుకోవాల్సిందేనని కొందరు వాదనకు దిగుతున్నారు. ఈసారి పాత బస్తీ నుంచి వందల మంది మహిళలు కలెక్టరేట్‌కు వచ్చి దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రయత్నించారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లు

డబుల్ బెడ్ రూం ఇళ్లు

ఒక దశలో వీరిని కలెక్టరేట్‌ గేట్‌ బయట పోలీసులు ఆపి బృందాల వారీగా లోపలికి పంపాల్సి వచ్చింది. సోమవారం వచ్చిన వాటిలో దాదాపు 1200 దరఖాస్తులకు ప్రజాప్రతినిధుల సిఫార్సులూ ఉన్నాయట. ఎమ్మెల్యేల సిఫార్సులు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

 డబుల్ బెడ్ రూం ఇళ్లు

డబుల్ బెడ్ రూం ఇళ్లు

దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వస్తుండడంతో కలెక్టరేట్‌ బయట ఉన్న రెండు జిరాక్స్‌ కేంద్రాలను అధికారులు సోమవారం మూసి వేయించారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లు

డబుల్ బెడ్ రూం ఇళ్లు

ఇక్కడ జిరాక్స్‌లు తీయించుకొని సమర్పిస్తుండటంతో జిరాక్స్‌ కేంద్రాలను మూసివేయించామని గృహ నిర్మాణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

English summary
heavy rush to government Double Bed room houses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X