నిరుపేద మైనారిటీలకు చేయూత.!రంజాన్ తోఫాలను అందజేసిన మేయర్ విజయలక్ష్మి.!
హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రంజాన్ గిఫ్ట్ ప్యాక్ లను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ముస్లిం సోదరులకు అందించారు. ఖైరతాబాద్ జోన్ లో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గిఫ్ట్ ప్యాక్ లను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ఉపవాసం దీక్షతో భక్తిశ్రద్ధలతో అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్ని మతాలను గౌరవిస్తూ బతుకమ్మ పండుగకు, క్రిస్మస్ వేడుకలకు, రంజాన్ పండుగకు, పేద కుటుంబాలకు బట్టలు పంపిణీ చేయడం గొప్ప విషయం అని కొనియాడారు. పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రజలందరూ ఆనందంగా పండుగను జరుపుకోవాలని అన్నారు.

అంతే కాకుండా ఈ సారి రంజాన్ పవిత్ర పర్వదినాన్ని ప్రతి ముస్లిం ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రతిఏటా రంజాన్ తోఫాలను పంపిణీ చేస్తున్నారన్నారు. సోమవారం తార్నాక పరిధిలోని హనుమాన్ నగర్ లో గల ముస్లింలకు రంజాన్ తోఫాలను విజయ లక్ష్మి పంపిణీ చేశారు.
దేశంలో హిందు, ముస్లిం, క్రిస్టియన్లకు సమానంగా చూస్తూ వారి వారి పండుగలకు అనేక రకాల కానుకలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. ముస్లింల కోసం మైనార్టీ కళాశాలలు, పాఠశాలలు, గురుకులాలు, షాదీ ముబారక్, మోజంలకు జీతాలు ఇలా ఎన్నో పనులు సీఎం చంద్రశేఖర్ రావు ప్రవేశ పెట్టారన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా తెలంగాణ సర్కారు వివిధ కార్యక్రమాలు చేపడుతోందని ఈ సందర్భంగా మేయర్ గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications