వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హేమంత్ సోరెన్ యూటర్న్: కేసీఆర్‌కు షాక్, థర్డ్‌పై రాహుల్ తొలిదెబ్బ, కూటమిలో 'ప్రధాని' పోటీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు థర్డ్ ఫ్రంట్ మద్దతుపై జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అప్పుడే వెనక్కి తగ్గారు. తద్వారా కేసీఆర్‌కు ఆరంభంలోనే గట్టి షాకిచ్చారు.

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రకటన చేయగానే హేమంత్ సోరెన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్రకు చెందిన ఐదారుగురు ఎంపీలు, చత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగీ, అసదుద్దీన్ ఓవైసీ వరుసగా మద్దతు తెలిపారు.

బీజేపీ-కాంగ్రెస్‌కు ఊహించని షాక్: కేసీఆర్ సంచలనం, ముంబై.. కోల్‌కతా.. దేశవ్యాప్త పర్యటన!బీజేపీ-కాంగ్రెస్‌కు ఊహించని షాక్: కేసీఆర్ సంచలనం, ముంబై.. కోల్‌కతా.. దేశవ్యాప్త పర్యటన!

 మొదట మద్దతు తెలిపింది మమత, సోరెన్

మొదట మద్దతు తెలిపింది మమత, సోరెన్

ముఖ్యమంగా, కేసీఆర్ ప్రకటన చేయగానే మొదట మద్దతు తెలిపింది మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్. ఇప్పుడు ఈ ఇద్దరిలో హేమంత్ సోరెన్ తెలంగాణ సీఎంకు గట్టి షాకిచ్చారు. రెండు రోజుల్లోనే ఆయన తన మనసు మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్ధమన్నారు.

 రాహుల్ గాంధీకి మద్దతు

రాహుల్ గాంధీకి మద్దతు

హేమంత్ సోరెన్ మంగళవారం మాట్లాడారు. రాహుల్ గాంధీకి మద్దతు పలికారు. రెండు రోజుల క్రితం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌పై మాట్లాడుతూ.. ఆయా రాష్టాల్లో బలమైన నాయకులు కలిస్తే జాతీయస్థాయిలోని పార్టీలను ఎదుర్కోవచ్చన్నారు. ఇప్పుడు అనూహ్యంగా తన నిర్ణయం మార్చుకున్నారు.

 వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి

తాము వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తామని హేమంత్ సోరెన్ చెప్పారు. లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ విషయమై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో చర్చించామన్నారు.

 రాహుల్ గాంధీతో సాగుతాం

రాహుల్ గాంధీతో సాగుతాం

వచ్చే ఎన్నికల్లో తమ నేతృత్వంలో కలిసి పని చేసే విషయమై రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారని హేమంత్ సోరెన్ చెప్పారు. జార్ఖండ్ ముక్తీ మోర్చా నేతృత్వంలో ముందుకు సాగుతామని చెప్పారు.

 థర్డ్ సాధ్యం కాదని జాతీయ పార్టీలు

థర్డ్ సాధ్యం కాదని జాతీయ పార్టీలు

కాగా, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడగానే బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు పలు ప్రాంతీయ పార్టీ నేతలు కూడా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. గతంలో ఎన్నో ఫ్రంట్‌లు వచ్చాయి, వెళ్లాయని, ఏదీ నిలబడలేదని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ చెబుతున్న ఫ్రంట్ కూడా అంతే అన్నారు.

 ఆరంభంలోనే కేసీఆర్‌కు షాక్, రాహుల్ తొలి దెబ్బ

ఆరంభంలోనే కేసీఆర్‌కు షాక్, రాహుల్ తొలి దెబ్బ

జాతీయ పార్టీలు, కొందరు నేతలు చెప్పిన విధంగానే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌కు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. థర్డ్ ఫ్రంట్ వైపు చూస్తున్న హేమంత్ సోరెన్‌ను తమ వైపు తిప్పుకోవడంలో రాహుల్ గాంధీ సఫలమయ్యారు. కేసీఆర్ ప్లాన్‌పై ఓ విధంగా రాహుల్ తొలి దెబ్బ వేశారు.

అందరికీ ప్రధానమంత్రి పదవే కావాలి

అందరికీ ప్రధానమంత్రి పదవే కావాలి

మమతా బెనర్జీ... కేసీఆర్‌కు మద్దతు పలికారు. మాయావతి వంటి వారితో మాట్లాడేందుకు కేసీఆర్ సన్నద్ధమయ్యారు. మాయావతి, మమత వంటి నేతలు ప్రధాని పదవిపై ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారు. అలాంటి వారితో ఫ్రంట్ అంటే.. అదీ ముఖ్యంగా అదే ప్రధానమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న కేసీఆర్‌కు సాధ్యమయ్యే పని కాదని అంటున్నారు.

English summary
Rahul Gandhi has given us his word that the upcoming Lok Sabha & Vidhan Sabha elections will be fought under the leadership of Jharkhand Mukti Morcha (JMM), says Hemant Soren, Former Jharkhand CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X