హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం.. ఓయో హోటల్స్ లో దందా.. బాలీవుడ్ సినీరచయిత అరెస్ట్!!

తాజాగా సైబరాబాద్ పోలీసులు చేసిన దాడులలో భారతదేశం నలుమూలల నుండి హైదరాబాద్ కు మహిళలను రప్పించి వేర్వేరు హోటల్ గదులలో నిర్వహిస్తున్న వ్యభిచార దందా గుట్టు రట్టు చేశారు. ఈ దాడుల్లో బాలీవుడ్ సినీ రచయిత అరెస్ట్ అయ్యారు.

కాదేది వ్యభిచారం చేయడానికి అనర్హం అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలో పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హైటెక్ వ్యభిచార ముఠాలు ఇబ్బడి ముబ్బడిగా వ్యభిచార దందాను నిర్వహిస్తున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యభిచార దందా నిర్వహించటానికి యధేచ్చగా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు పోలీసులకు పట్టు బడకుండా తమ వ్యభిచార సామ్రాజ్యాన్ని అనేక చోట్ల విస్తరిస్తున్నారు.

 దేశం నలుమూలల నుండి మహిళలను రప్పించి వ్యభిచార దందా

దేశం నలుమూలల నుండి మహిళలను రప్పించి వ్యభిచార దందా

తాజాగా సైబరాబాద్ పోలీసులు చేసిన దాడులలో భారతదేశం నలుమూలల నుండి హైదరాబాద్ కు మహిళలను రప్పించి వేర్వేరు హోటల్ గదులలో నిర్వహిస్తున్న వ్యభిచార దందా గుట్టు రట్టు చేశారు. ఇక ఈ దందా వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాల నుండి యువతులను ట్రాప్ చేసి, వారిని హైదరాబాద్ కు రప్పించి ఓయో రూములను బుక్ చేసి ఎవరికి పట్టు పడకుండా గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

ఓయో రూమ్స్ బుక్ చేసి వ్యభిచార దందా

ఓయో రూమ్స్ బుక్ చేసి వ్యభిచార దందా

వాట్సప్ ద్వారా యువతల ఫోటోలను విఠలకు పంపి వల విసురుతున్నారు. మొత్తం ఆన్లైన్ లోనే జరుగుతున్న ఈ బేరసారాల దందాలో ఫైనల్ గా వ్యభిచారం మాత్రం నగరవ్యాప్తంగా అనేక చోట్ల ఉన్న ఓయో రూములను బుక్ చేసుకుని నిర్వహిస్తున్నారు.

ఇక సైబరాబాద్ పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేసి మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ముంబై, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుండి 31 స్మార్ట్ ఫోన్లు, నాలుగు కీప్యాడ్ ఫోన్లు, ఐదు ల్యాప్టాప్ లు, రెండు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఇతర బ్యాంకు కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

బాలీవుడ్ సినీ రచయిత మోహిత్ గార్గ్ అరెస్ట్

బాలీవుడ్ సినీ రచయిత మోహిత్ గార్గ్ అరెస్ట్

ఇక పోలీసులు అరెస్ట్ చేసిన ఈ వ్యభిచార ముఠాలో బాలీవుడ్ సినీ రచయిత మోహిత్ గార్గ్ కూడా ఉన్నారు. స్కోక్కా. ఇన్, లోకాంటో, వివా స్ట్రీట్ తదితర వెబ్సైట్లను ఉపయోగించి హైదరాబాద్ కేంద్రంగా ఈ హైటెక్ వ్యభిచారాన్ని వీరు నిర్వహిస్తున్నారు.

అంతే కాదు నిందితులు గతంలో ఐపీసీ సెక్షన్ 370 ఏ ప్రకారం అనైతిక ట్రాఫిక్ లోని సెక్షన్లు 3,4,5,6 కింద కేసుల్లో ప్రమేయం ఉన్నట్టు గత రికార్డును కలిగి ఉన్నారు. దీంతో వీరి నుండి మరింత కూపి లాగే ప్రయత్నం చేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+