ఆ గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేస్తే అభ్యంతరం ఎందుకు: హైకోర్టు ప్రశ్న
హైదరాబాద్: సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనం పైన సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. బెంగళూరు తరహాలో విగ్రహాలను నిమజ్జనం చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పైన న్యాయస్థానం విచారణ చేపట్టింది.
సాధ్యాసాధ్యాలపైన నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. బెంగళూరు విధానాన్ని పరిశీలించాలని సూచించింది.
పదిహేను అడుగుల లోపు విగ్రహాలను నిమజ్జనం చేస్తే అభ్యంతరం ఏమిటని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. దీని వల్ల వచ్చే సమస్యలు ఏమీ లేవని పేర్కొంది. అనంతరం విచారణను వాయిదా వేసింది.

వినాయక చవితి అనంతరం ప్రతి ఏడాది హుస్సేన్ సాగర్‌లో వేలాది విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. బెంగళూరులో లోతుగా తవ్విన గుంతల్లో నీళ్లను నింపి అందులో విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. ఈ విధానాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు.
భాగ్యనగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం పైన హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. వినాయక విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయడాన్ని సవాల్ చేస్తూ వేణుమాధవ్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.












Click it and Unblock the Notifications