వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు హైకోర్టు అభినందన, ఏపీ ఆరోపణలపై సుప్రీంలో టి లాయర్ల వాదన

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పాలమూరు జిల్లా ఇసుక అక్రమ తవ్వకాలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇసుక అక్రమాలపై వాట్సప్‌ ద్వారా ఫిర్యాదులు తీసుకుంటున్నామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అలాగే అక్రమాలకు పాల్పడిన 99 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. ప్రభుత్వం చర్యలను హైకోర్టు అభినందించింది.

అగ్రిగోల్డ్ విచారణ వాయిదా

అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. ఆస్తుల విక్రయాల అంశాన్ని కోల్‌కతాకు చెందిన ఎంఎస్‌టీసీకి అప్పగించింది.

ఆస్తుల అమ్మకం నుంచి సీ1 సంస్థను తప్పుకోవాలని ఆదేశించింది. ఏబీసీ, ఎంజంక్షన్ గ్రూపులను మధ్యవర్తిగా ఉంచాలని తెలంగాణ పిపి ప్రతిపాదించారు. మరోవైపు, అగ్రిగోల్డ్ విషయంలో మీడియా కథనాలను తాము నిరోధించలేమని హైకోర్టు వెల్లడించింది.

High Court appreciate Telangana government

చట్టాన్ని అతిక్రమించం: సుప్రీంలో తెలంగాణ లాయర్లు

సుప్రీం కోర్టులో ఏపీ ఉన్నత విద్యా మండలి కేసు డిసెంబర్ 9కి వాయిదా పడింది. ఏపీ తరపున కోర్టులో సీపీ రావు వాదనలు వినిపించారు.

తెలంగాణ తరపున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. దాదాపు వంద సంస్థల ఖాతాలను స్తంభింపజేశారని ఏపీ సర్కారు లేనిపోని ఆరోపణలు చేసిందన్నారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే వ్యవహరిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించారు. చట్టాన్ని అతిక్రమించి పనులు చేయబోమన్నారు.

English summary
High Court appreciate Telangana government for its action against sand mafia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X