జగన్‌కు షాక్: వ్యక్తిగత హజరు మినహయింపు పిటిషన్ తిరస్కరణ

హైదరాబాద్:ఆస్తుల కేసులో సుదీర్ఘ కాలంగా విచార‌ణ ఎదుర్కోంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి గురువారం నాడు హైకోర్టులో చుక్కెదురైంది.

సీబీఐ కోర్టులో వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తూ వైఎస్ జ‌గ‌న్ త‌న న్యాయ‌వాది ద్వారా ఇటీవ‌ల‌ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు... ఏదైనా ప్ర‌త్యేక సంద‌ర్భం ఉంటే సీబీఐ కోర్టులోనే ఇటువంటి పిటిష‌న్‌లు వేసుకోవాల‌ని సూచించింది.

మొత్తం 11 కేసుల్లో ప్రతి శుక్రవారం జగన్‌ సీబీఐ కోర్టులో హాజరవుతున్నారు. ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న తాను వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గోనాల్సి ఉంది.

High court dismisses of ysrcp chief Ys Jagan petition

ఈ కారణంగా తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. తన బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

జగన్‌కు మినహాయింపు ఇవ్వొద్దని కోర్టులో సీబీఐ తన వాదనలు వినిపించింది. ఇందుకు ఏకీభవించిన న్యాయస్థానం మినహాయింపు కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+