కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..!!

రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాలంటూ తెలంగాణ హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వేడుకలను నిర్వహించకూడదంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ పై విచారణ అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసి

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు.. కీలక ఆదేశాలను జారీ చేసింది. గణతంత్ర దినోత్సవాలను నిర్వహించకూడదంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన లంచ్ మోషన్ పిటీషన్ పై విచారణ ముగించిన అనంతరం ఈ ఆదేశాలను ఇచ్చింది.

రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ మాధవి సారథ్యంలోని ధర్మాసనం కొద్దిసేపటి కిందటే ఆదేశాలు వెలువడించింది. తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించకూడదంటూ ఇదివరకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలైంది.

High Court given the directions to Telangana govt to hold Republic day celebrations

ఒక్కరోజే గడువు ఉండటం వల్ల అత్యవసరంగా దీన్ని విచారణకు స్వీకరించాలని పిటీషనర్లు విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం జస్టిస్ మాధవి సారథ్యంలోని బెంచ్.. దీనిపై విచారణ చేపట్టింది. వాదోపవాదాలను ఆలకించింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు.

ఇచ్చిన కారణాలు, వివరణలు సరైనవిగా లేవని ధర్మాసనం అభిప్రాయపడింది. రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలంటూ తుది ఆదేశాలను జారీ చేసింది. ఇదివరకు రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించాల్సి ఉంటుందంటూ కేంద్ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.

యూనివర్శిటీలు మొదలుకుని సాధారణ పాఠశాలల వరకు పెద్ద ఎత్తున విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించింది. దీన్ని పరిగణనలోకి తీసుకోలేదని, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులను రాష్ట్రం ధిక్కరించిందంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+