రేవంత్ రెడ్డి విడుదలకు లైన్ క్లియర్: తీర్పు కాపీని సవరించిన హైకోర్టు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టై బెయిలు పొందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి విడుదల అయ్యేందుకు మార్గం సుగమం అయింది. బెయిల్ పూచీకత్తు తీర్పు కాపీని హైకోర్టు బుధవారం సవరించింది. ఈ కాపీ కాసేపట్లో ఏసిబి కోర్టుకు చేరనుంది. కాపీ చేరిన తర్వాత రేవంత్ రెడ్డిని విడుదల చేసే అవకాశం ఉంది.
బెయిల్ ఆర్డర్ కాపీ సవరణ కోసం రేవంత్ న్యాయవాదులు ఫర్‌బీయింగ్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు కొత్త ఆర్డర్ జారీ చేసింది. ష్యూరిటీలు, డిపాజిట్లు, బెయిల్ ఆర్డర్‌లను ఏసీబీ కోర్టులో సమర్పించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో రేవంత్ తరపు లాయర్లు కోరారు.

దీంతో రేవంత్‌రెడ్డి బెయిల్ ఆర్డర్‌లో సాంకేతిక పొరపాటును హైకోర్టు సరిదిద్ది కొత్త ఆర్డర్‌ను విడుదల చేసింది. ఏసీబీ కోర్టులో హైకోర్టు విడుదల చేసిన ఆర్డర్ కాపీని రేవంత్‌రెడ్డి తరపు లాయర్లు మరికొద్దిసేపట్లో అందజేయనున్నారు.
ఆయా పత్రాలను పరిశీలించిన అనంతరం ఏసీబీ కోర్టు రేవంత్‌రెడ్డిని విడుదలకు ఆదేశాలు ఇవ్వనుంది. కాగా, రేవంత్‌రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు ఆయన అభిమానులు, టిడిపి కార్యకర్తలు పెద్దఎత్తున చర్లపల్లి జైలు వద్దకు చేరుకున్నారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
ఉద్యోగుల బకాయిల విడుదలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, డెడ్ లైన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications