కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో కేసీఆర్‌కు ఊరట: షరతులు వర్తిస్తాయి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు హైకోర్టులో బుధవారం ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది.

ప్రస్తుతానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిలిపేయండి: కేసీఆర్‌కు గట్టి షాక్

TRS and Congress workers Throw Chairs at each Other, Video
 అడవులు మాత్రం ధ్వంసం చేయొద్దు

అడవులు మాత్రం ధ్వంసం చేయొద్దు

అయితే అనుమతులు లేకుండా ప్రభుత్వం అటవీ ప్రాంతంలో పనులు చేపట్టరాదని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. రిజర్వ్‌డ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పనులు వద్దని చెప్పింది. అడవులు ధ్వంసం చేయవద్దని సూచించింది.

 వ్యవసాయానికి నో, తాగునీటికి ఓకే

వ్యవసాయానికి నో, తాగునీటికి ఓకే

పర్యావరణ అనుమతులు లేకుండా వ్యవసాయ సాగునీటి ప్రాజెక్టులను చేపట్టవద్దని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తాగునీటి అవసరాలకు మాత్రమే ప్రాజెక్టును ఉపయోగించాలని చెప్పింది. పిటిషనర్‌కు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చునని చెప్పింది.

 పదిహేను కొత్త జిల్లాల పరిధిలో సాగునీటి కోసం కానీ

పదిహేను కొత్త జిల్లాల పరిధిలో సాగునీటి కోసం కానీ

కాగా, రూ.80 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో పదిహేను కొత్త జిల్లాల పరిధిలోని దాదాపు 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం చేపట్టింది.

 గ్రీన్ ట్రైబ్యునల్ స్టే

గ్రీన్ ట్రైబ్యునల్ స్టే

దీనిపై నిర్వాసితులు కొందరు గ్రీన్ ట్రైబ్యునల్‌కు వెళ్లారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టును చేపట్టారని వారు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ట్రైబ్యునల్‌ పర్యావరణ అనుమతులు తీసుకోలేదని చెబుతూ పనులు నిలిపివేయాలని ఆదేశించింది. గ్రీన్ ట్రైబ్యునల్ స్టేపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ పనులకు పచ్చ జెండా వచ్చింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
High Court Green Signal to Kaleshwaram Project on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి