వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షరతులతో కూడిన ర్యాలీకి మరోచోట హైకోర్టు ఓకే, ఓయులో నో

నిరుద్యోగ ర్యాలీ తలపెట్టిన తెలంగాణ జేఏసీకి హైకోర్టులో కొంత ఊరట లభించింది. నాగుల్ మెట్రో మైదానంలో షరతులతో కూడిన ర్యాలీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: నిరుద్యోగ ర్యాలీ తలపెట్టిన తెలంగాణ జేఏసీకి హైకోర్టులో కొంత ఊరట లభించింది. నాగుల్ మెట్రో మైదానంలో షరతులతో కూడిన ర్యాలీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

బుధవారం నాడు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల దాకా ర్యాలీకి అనుమతి లభించింది.

దీనిపై జేఏసీ తరఫు న్యాయవాది మాట్లాడారు. తాము ఓయులో అని ప్రత్యేకంగా చెప్పలేదని, పోలీసులు తమకు ర్యాలీ కోసం అయిదు ఆప్షన్లు ఇచ్చారని, మేం కూడా అయిదు ఆప్షన్లు ఇచ్చామని చెప్పారు.

<strong>మేం చెప్పింది తప్పితే..: కోదండరాం, అక్కడ నో చెప్పిన పోలీసులు</strong>మేం చెప్పింది తప్పితే..: కోదండరాం, అక్కడ నో చెప్పిన పోలీసులు

High Court green signal for TJAC nirudyoga rally at Nagol Metro land

జల్లికట్టు ఉద్యమంలో నిరుద్యోగ ర్యాలీని మార్చాలని జేఏసీ ప్రయత్నాలు చేసిందని కూడా ఆరోపణలు చేశారన్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత పోలీసులదే అన్నారు.

దానిపై ఓ విలేకరు మాట్లాడుతూ.. మీరు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటారా అని ప్రశ్నించగా.. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మేం ఏం చెయ్యాలని లాయర్ అన్నారు. తమకు నాగోలో మెట్రో మైదానంలో ర్యాలీకి అనుమతి వచ్చిందన్నారు.

ఓయులో నో

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ర్యాలీ నిర్వహించాలని తొలుత ఓయు జేఏసీ భావించింది. కానీ ఓయులో ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీకి అనుమతించమని పోలీసులు చెప్పారు. అనంతరం హైకోర్టు షరతులతో కూడిన ర్యాలీకి మరోచోట అనుమతిచ్చింది.

English summary
High Court green signal for TJAC nirudyoga rally at Nagol Metro land.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X