ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షులు అశోక్ బాబుకు కోర్టు ధిక్కార నోటీసులు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షులు అశోక్ బాబుకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ అయ్యాయి. హైదరాబాదులోని గన్‌ఫౌండ్రీలో ఏపీ ఎన్జీవో కార్యాలయ వివాదంపై పిటిషన్ దాఖలైంది.

దీనిపై విచారించిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఈ నోటీసులను జారీ చేసింది. కార్యాలయంలో కొంతభాగం టీఎన్జీవోకు కేటాయించాలని గతంలో న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

High Court issues contempt notices to Ashok Babu

కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదంటూ టీఎన్జీవో హైకోర్టుకు వెళ్లింది. దీంతో కోర్టు ధిక్కారం కింద ఎందుకు పరిగణించకూడదంటూ ప్రశ్నిస్తూ వివరణ ఇవ్వాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
High Court issues contempt notices to AP NGO leader Ashok Babu over Hyderabad APNGO office.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి