వాళ్లకెలా అప్పగిస్తారు?: డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఎంపికపై హైకోర్టు అసంతృప్తి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రెండు పడకల ఇళ్ల కేటాయింపునకు లబ్ధిదారుల ఎంపికపై తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. స్థానిక ఎమ్మెల్యే, ఆ జిల్లా మంత్రికి లబ్దిదారుల ఎంపిక చేసే బాధ్యతను 50:50 నిష్పత్తిలో అప్పగించడం అన్యాయమని పేర్కొంటూ దాఖలైన పిటీషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.
అక్టోబర్ 15న గృహ నిర్మాణ శాఖ జారీ చేసిన జివోను సవాల్ చేస్తూ జి.దేవదాస్ దాఖలు చేసిన పిల్‌పై విచారణ చేపట్టింది. లబ్దిదారుల ఎంపికను కమిటీకి అప్పగించకపోవడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఏ విధంగా లబ్దిదారుల ఎంపిక చేస్తారని, అందుకు విధివిధానాలు ఏమిటని ప్రశ్నించింది.
ప్రభుత్వ ఉత్తర్వులు చట్టవిరుద్దంగా కనిపిస్తున్నాయని తెలిపింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చి తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది.

పెద్దకుంట తండా వద్ద అండర్‌పాస్‌పై నివేదిక ఇవ్వండి
మహబూబ్‌నగర్ జిల్లా పెద్దకుంట తండా వద్ద తరచు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అక్కడ ఉన్న అండర్‌పాస్ పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఎన్‌హెచ్‌ఐఏ, పోలీసు అధికారులను ఆదేశించింది.
ఆసిమ్ అవతార్‌దాస్, మరో ఇద్దరు దాఖలు చేసిన పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కేసు విచారణను మూడు వారాలు వాయిదా వేసింది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications