ధరణిలో ఆస్తుల నమోదుపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. కౌంటర్ దాఖలుకు సర్కార్ కు ఆదేశం
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ భూములతో పాటుగా, వ్యవసాయేతర ఆస్తులపై కూడా సర్వే చేయించి వివరాలు సేకరించే పనిలో పడింది. ఇళ్ళు, షాపులు , ఖాళీ స్థలాలు, ఇలా ప్రజల ఆస్తుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసే పనిలో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయాలని చూస్తున్న ధరణి వెబ్ సైట్ లో ఆస్తుల నమోదు ప్రక్రియపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది గోపాల్ శర్మ. రాష్ట్రంలో ప్రజల నుండి ధరణి వెబ్ పోర్టల్ లో ఆస్తుల నమోదు ప్రక్రియపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
ఈ నేపథ్యంలో దాఖలైన ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై నేడు విచారణ జరిపిన హైకోర్టు ఆసక్తికర ప్రశ్నలను వేసింది. ప్రభుత్వం నుండి సమాధానాలను కోరింది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని, కేసును వాయిదా వేసింది.

న్యాయవాది గోపాల్ శర్మ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం లో చట్టబద్ధత లేకుండానే వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని , ఆధార్, కులం వివరాలు అడుగుతున్నారని , ఇది ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం అని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
అయితే ధర్మాసనం సేకరించిన వివరాలను రహస్యంగా ఉంచితే తప్పేమీ లేదు కదా అంటూ విచారణ సందర్భంగా పిటిషనర్ ను ప్రశ్నించింది. అంతేకాదు ప్రభుత్వ సమాధానాన్ని సైతం కోరింది ధరణి వెబ్ సైట్ లో ఆస్తులు నమోదుకు గడువు లేదని ఇది నిరంతర ప్రక్రియ అని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. ఆస్తుల నమోదుకు చివరి తేదీ లేదని అడ్వకేట్ జనరల్ బి ఎస్ ప్రసాద్ వివరణను హైకోర్టు నమోదు చేయడంతో పాటుగా,దీనికి సంబంధించిన కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది . ధరణికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చెయ్యాలని సూచించింది. న్యాయవాది గోపాల్ శర్మ పిటిషన్ పై విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
Recommended Video
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications