గేమ్‌చేంజర్ షోల పై హైకోర్టులో కీలక పరిణామాలు.!!
గేమ్‌చేంజర్ సినిమా ప్రదర్శన వేళలపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ విచారణ వేళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమాలను తెల్లవారు జామున నాలుగు గంటలకు ప్రదర్శిం చేందుకు అనుమతి ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టు పేర్కొంది. పదహారేండ్లలోపు పిల్లలను తెల్లవారుజాము, అర్ధరాత్రి షోలకు అనుమతించడం సరికాదని అభిప్రాయపడింది. నేడు తదుపరి విచారణ కొనసాగనుంది.
హీరో రామ్‌చరణ్ నటించిన గేమ్‌చేంజర్ సినిమాను తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రదర్శిం చేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం మెమో జారీ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ నటుడు నటించిన సినిమా అయితే మరో నెలరోజులైనా జనం చూసేందుకు వస్తారని.. ఒకేరోజు అనేక షోలు ఎందుకు ప్రదర్శించాలని ధర్మాసనం ప్రశ్నించింది. అర్ధరాత్రి, అపరాత్రి, తెల్లవారకుండానే సినిమా ప్రదర్శనలు వేయడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయ పడింది.

రెండు షోల మధ్య 15 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంటే ఎలా సరిపోతుం దని హైకోర్టు ప్రశ్నిం చింది. థియేటర్‌లోని ప్రేక్షకులు బయటకు వెళ్లేందుకు, సినిమా చూడాల్సి న వాళ్లు లోపలికి వచ్చేందు కు పావుగంట సమయం ఎలా సరిపోతుందా అంటూ సందేహం వ్యక్తం చేసింది. పుష్ప- 2 సినిమా ప్రదర్శనప్పుడు సంధ్య ధియేటర్ వద్ద తొక్కిసలాట, తాజాగా తిరుపతిలో జరిగిన ఘటన గురించి ప్రస్తావన చేసింది. ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని చెప్పిన తర్వాత గేమ్ చేంజర్ సినిమా ఏమిటని ప్రశ్నించింది. సినిమా రిలీజ్‌కు ముందు కేసులు వేయడంతో సరిపెట్టొద్దని సూచించిన హైకోర్టు.. లాజికల్ ఎండ్ కోసం ఎందుకు ప్రయత్నం చేయడం లేదని పిటిషనర్లను ప్రశ్నించింది.
వాస్తవానికి ఇది ప్రజాహితంతో ముడిపడిన వ్యవహారం కాబట్టి ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎందుకు దాఖలు చేయరని వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో చాలామంది తెల్లవారుజామునే కాకుండా అర్ధరాత్రి షోలకు కూడా వెళ్లేందుకు సుముఖంగా ఉన్నప్పుడు మీకేమిటి అభ్యంతరం అని పిటిషనర్లను ప్రశ్నించింది. ఉభయపక్షాల వాదనల అనంతరం.. ఈ వ్యాజ్యాలతోపాటు సంధ్య థియేటర్ ఘటనపై దాఖలైన పిటిషన్‌ను కలిపి శుక్రవారం విచారించాలని న్యాయస్థానం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications