బీజేపీ నేత పిటిషన్: తెలంగాణ సీఎస్‌కు కోర్టు ధిక్కార నోటీసులు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రైతు రుణ విమోచన కమిషన్‌ ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులను పంపించింది.

వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని న్యాయస్థానం ఆదేశించింది. రైతు విమోచన కమిషన్‌ ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి గతంలో కోర్టును ఆశ్రయించారు.

High Court sent contempt for court notices to Telangana CS

దానిపై విచారించిన కోర్టు రైతు రుణవిమోచన కమిషన్‌ ఏర్పాటు చేయాలని సీఎస్‌ను ఆదేశించింది. దానిపై ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడంతో ఇంద్రసేనారెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ధిక్కార నోటీసులు జారీ చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
High Court sent contempt for court notices to Telangana Chief Secretary.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి