తెలంగాణ గ్రూప్-2పై హైకోర్టు స్టే

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-2 నియామక ప్రక్రియపై హైకోర్టు సోమవారం స్టే విధించింది. మూడు వారాల వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

గ్రూప్ 2లో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
డబుల్ బబ్లింగ్, వైట్‌నర్ ఉపయోగించిన అభ్యర్థులను ఎంపిక చేశారంటూ కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

 High Court stays on Group-2

1,032 పోస్టులకు టీఎస్ఎస్పీ గత నవంబర్‌లో రాత పరీక్ష నిర్వహించింది. కాగా, ఈ పరీక్షలకు 5.65లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పటికే ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్ఎస్పీ ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా, ఎంపిక చేసిన అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించాలని టీఎస్ఎస్పీ కసరత్తులు ప్రారంభించగా.. తాజా హైకోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ మరో మూడు వారాలపాటు నిలిచిపోనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
High Court on Monday stays on Group-2 selection process of candidates.
Please Wait while comments are loading...