అసాధారణమైన కేసు: హైకోర్టు, రేవంత్ రెడ్డికి షరతులు ఇవీ...

హైదరాబాద్: ఓటుకు నోటు కేసును హైకోర్టు ఆసాధరమైనదిగా అభివర్ణించింది. ఈ కేసులో ఎ1, ఎ2, ఎ3 నిందితులైన రేవంత్ రెడ్డి, ఉదయ సింహ, సెబాస్టియన్‌లకు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి అనుకూలంగా ఓటు వేయాలంటూ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు లంచం ఇస్తూ ఎసిబికి చిక్కిన తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి, ఇతర నిందితులది అసాధరమైన కేసుగా హైకోర్టు భావించింది.

హైకోర్టు రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ విధించిన షరతులు ఈ విధంగా ఉన్నాయి.

High court terms cash for vote as rare case

1. రూ. 5 లక్షల పూచీకత్తు
2. సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధి దాటి బయటకు వెళ్లరాదు.
3. పాస్‌పోర్టును కోర్టుకు సమర్పించాలి.
4. సాక్షులను ఏ విధంగా కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నించవద్దు
5. ఎసిబి ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలి.
6. తదుపరి దర్యాప్తునకు సహకరించాలి.
7. ఒక వేళ షరతులు పాటించకపోతే ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తాం

కాగా, రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి స్పందించారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు. రేవంత్ రెడ్డికి బెయిల్ రావడంతో న్యాయమే గెలిచిందని అన్నారు.

నోటుకు ఓటు వ్యవహారం రాజకీయ కుట్రతోనే జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ విషయం తాము మొదటి నుంచీ చెబుతూ వస్తున్నామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+