పాలమూరులో ఎనిమిది వేల ఏళ్ల కిందటే ఆది మానవుడు
పాలమూరు: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని చౌదరపల్లి గ్రామ శివారులో బయ్యన్న గుట్ట పైన ఉన్న గుహలో ఆది మానవుల సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు.
పురావస్తు శాఖ జూనియర్ అసిస్టెంట్ బాలరాజు, హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పురావస్తు శాఖ ఆచార్యులు శ్రీనివాస చారి ఆదివారం గుహను సందర్శించారు. గుహలో కొన్నేళ్ల క్రితం ఆది మానవులు సంచరించిన ఆనవాళ్లను గుర్తించారు.

దాదాపు వారు ఎనిమిది వేల ఏళ్ల క్రితం ఈ గుహలో నివసించినట్లుగా వారు గుర్తించారని తెలుస్తోంది. అక్కడి చిత్రాలను వారు పరిశీలించారు. వారు సందర్శించిన గుహలో పలు చిత్రాలు కనిపించాయి. కమలం, ధనస్సు వంటి చిత్రాలు కనిపించాయి.












Click it and Unblock the Notifications