• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వాస్తు పేరుతో చరిత్రను శిధిలం చేస్తున్నారు.!కేసీఆర్ పై మరోసారి మండిపడ్డ రేవంత్ రెడ్డి..!

|

హైదరాబాద్ : తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు సచివాలయం కూల్చివేత వంటి చర్యలపై మల్కాజ్ గిరి ఎంపి, రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మన్నికగల సచివాలయ భవంతులను కూల్చివేయడాన్ని చీకటి అధ్యాయంగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు

ఇతర మతాల విశ్వాసాలను ఆచారాలను దెబ్బతీయడమే కాకుండా 16 మంది ముఖ్యమంత్రులు పాలించిన సచివాలయాన్ని ఇప్పుడు కూల్చి వేయడం దారుణమైన దుశ్చర్యగా పేర్కొన్నారు. వాస్తు పేరుతో చంద్రశేఖర్ రావు చరిత్రను భూస్ధాపితం చేయడం సమంజసం కాదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

భవంతులను కూల్చడం సరికాదు.. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్..

భవంతులను కూల్చడం సరికాదు.. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్..

అంతే కాకుండా సీఎం చంద్ర శేఖర్ రావు తన కుమారుడిని సిఎం చేయడం కోసం సచివాలయాన్ని కూల్చివేయడం నియంత పాలనకు నిదర్శనమని రేవంత్ రెడ్డి తెలిపారు. మనుషులకు సెంటిమెంట్ తప్పు కాదు కానీ, మూఢ నమ్మకాలను ఆచరించడం అత్యంత హేయమైన చర్య అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. మన్నిక గల భవంతులను కూల్చివేసి కొత్తవి నిర్మించడం వల్లవందల కోట్ల రూపాయల ఆర్ధిక భారం పడుతుందని విమర్శిచారు. కరోనా వైరస్ వంటి క్టిష్ట సమయంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే కట్టడి చేయడం మానేసి ఇతర వ్యాపకాలపై దృష్టి సారించడం దారుణమని రేవంత్ రెడ్డి తెలిపారు.

ప్రార్ధనా మందిరాలను తొలగిస్తారా.? ప్రజల మనోభావాలతో చెలగాటం వద్దన్న రేవంత్..

ప్రార్ధనా మందిరాలను తొలగిస్తారా.? ప్రజల మనోభావాలతో చెలగాటం వద్దన్న రేవంత్..

అంతే కాకుండా సచివాలయంలోని మజీద్, నల్ల పోచమ్మ గుడి చర్చ్ లను నిర్ధాక్షిణ్యంగా కుల్చివేసారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ ఉద్యమానికి నల్ల పోచమ్మ గుడి వేదికైందని, ఇప్పుడు వాటిని కూల్చి ఆయా వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా సిఎం చంద్రశేఖర్ రావు వ్యవహరించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎస్ సోమేశ్ కుమార్, డీజిపీ మహెందర్ రెడ్డిలకు సిఎం రాత్రీకి రాత్రే భవంతులను తొలగించాలనే ఆదేశాలను జారీ చేసారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ట్యాంక్ బండ్ ,నెక్లెస్ రోడ్ సమీపంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేయవద్దని సుప్రీమ్ కోర్టు తీర్పు ఉన్నప్పటికి భవంతుల నిర్మాణాలను ఎలా చేపడతారని రేవంత్ రెడ్డి గుర్తు చేసారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి.. బీజేపిని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి.. బీజేపిని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి..

సీఎం చంద్రశేఖర్ రావు మజీద్, నల్ల పోచమ్మ గుడి కూల్చితే బిజేపి, మజ్లిస్ పార్టీ ల నేతలు ఎందుకు స్పందించడం లేదని, పైగా కొంత మంది స్వాగతం అనడం సిగ్గుచేటని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉద్యోగ సంఘాలకి నరేందర్ రావు, ముస్లిం మతాచారాలకు అసదుద్దీన్ ఒవైసీ వకల్తా పుచ్చుకోవడం సమంజసం కాదని అన్నారు. సచివాలయ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాల కూల్చివేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు.

మజ్లిస్, బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు అన్ని తెరవెనక ఒకే ఎజెండాతో ముందుకు వెళ్తాయని రేవంత్ రెడ్ది ఆరోపించారు.

  Corona చికిత్సను Aarogyasri పరిధిలో చేర్చిన AP ప్రభుత్వం.. రేట్ ఫిక్స్! || Oneindia Telugu
  అర్ధరాత్రి కూల్చివేతలు ఎందుకు.. కాంగ్రెస్ మరో నేత షబ్బీర్ అలీ విమర్శలు..

  అర్ధరాత్రి కూల్చివేతలు ఎందుకు.. కాంగ్రెస్ మరో నేత షబ్బీర్ అలీ విమర్శలు..

  అంతే కాకుండా సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపి మహేందర్ రెడ్డిలు పూజ చేసి మరీ నల్ల పోచమ్మ విగ్రహాన్ని తొలగించారని కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు చంద్రశేఖర్ రావు వాస్తు పేరుతో సచివాలయం కూల్చి వేయడం దారుణమని తెలిపారు. కేసీఅర్ నిర్ణయంతో ఏకభవిస్తున్న అసదుద్దీన్ ఒవైసీ ఇంతకాలం బాబ్రి మజీద్ పై ఎందుకు రాజకీయం చేసారని ప్రశ్నించారు. సచివాలయ భవన నిర్మాణాల్ని కూల్చివేయాలని ప్రభుత్వం అనుకోవటంతో అందుకు సంబంధించిన పనులను అర్థరాత్రి దాటిన తర్వాత చేపట్టడం అత్యంత దారుణమని షబ్బీర్ అలీ స్పష్టం చేసారు.

  English summary
  Malkaj Giri MP and Revant Reddy have reacted sharply to the political developments in Telangana and the demolition of the Secretariat. Revanth Reddy described the demolition of the durable Secretariat buildings as a dark chapter.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more