భార్యపై దాష్టీకం: బావ మరుదులే కొట్టి చంపారు
హైదరాబాద్: సోదరిని హింసిస్తున్నాడనే కోపంతో బావమరుదులు తమ బావనే హత్య చేసిన సంఘటన హైదరాబాదులోని బహదుర్‌పుర పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన షేక్ చాంద్(30) షెఫ్ మాస్టర్‌గా పని చేస్తున్నాడు.
ప్రవృత్తిగా చోరీలు చేస్తూ పలు పోలీస్‌స్టేషన్లలో నిందితుడిగా ఉన్నాడు. జైలుకు వెళ్లిన షేక్ చాంద్ ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే, అతడు తన భార్యను ప్రతి చిన్న విషయానికి కూడా మానసికంగా హింసిస్తుంటాడు. దీంతో అతడిపై బావమరదులు కోపం పెంచుకున్నారు.

ఐ క్రమంలో సోమవారం రాత్రి పవన్ లారీ పార్కింగ్ ప్రాంతంలో షేక్ చాంద్‌పై దాడి చేశారు. అతడి తలపై బలంగా కొట్టడంతో తీవ్రగాయాలైన చాంద్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్‌పెక్టర్ హరీష్ కౌశిక్ తెలిపారు.












Click it and Unblock the Notifications