కేటీఆర్ ను రీప్లేస్ చేసే దమ్మున్న ఐటీ మంత్రి ఎవరు?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించి రాష్ట్రంలో పాలన పగ్గాలు చేపడుతోంది. ఇక ఈ సమయంలో ముఖ్యమంత్రి ఎవరు అన్నదానిపై ఇప్పటి వరకు ఉత్కంఠ కొనసాగగా, ఎట్టకేలకు రేవంత్ రెడ్డినే సీఎంగా నిర్ణయించినట్టు తేలింది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర పురోగతిలో కీలకంగా భావించే ఐటీ శాఖ ని ఎవరికి ఇవ్వబోతున్నారు? అన్న చర్చ కూడా జరుగుతుంది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రిగా పనిచేసిన ఐటీ శాఖలో ఆయనను రీప్లేస్ చేయగలిగిన దమ్మున్న నాయకుడు ఎవరు? అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని విస్తరింప చేయడానికి చాలా కృషి చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ తో పాటు గచ్చిబౌలి వంటి కీలక ప్రాంతాలలో కేటీఆర్ హయాంలో ఐటీ విస్తరణ జరిగింది.

ho is the IT minister of telangana? who has the guts to replace KTR?

రాష్ట్రంలోకి అనేక సంస్థలను కూడా ఆహ్వానించి, వారికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పన చేసి ఐటీ రంగానికి ఆయన పెద్దపీట వేశారు. ఇక కేటీఆర్ ఐటి పైన ఫోకస్ పెట్టి పనిచేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రి ఎవరు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఐటీ శాఖను ముందుకు తీసుకు వెళ్లిన కేటీఆర్ ను మర్చిపోయేలా చేసే మంత్రి ఎవరు అన్నది జోరుగా చర్చ జరుగుతుంది.

అయితే కేటీఆర్ పనితీరుకు ఫిదా అయినా చాలామంది కచ్చితంగా కేటీఆర్ ను మిస్ అవుతామని తెగ బాధ పడుతున్నారట. ఫ్రెండ్లీ మినిస్టర్ గా అందరితోను బాగా మాట్లాడే కేటీఆర్, సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో ప్రజలకు ఎప్పుడు దగ్గరగా ఉంటారు. ఇక అలాంటి కేటీఆర్ ను తాము మిస్ అవుతున్నామని బాధపడుతున్నారు పలువురు కేటీఆర్ ఫ్యాన్స్.

అయితే ఇదే సమయంలో ఎవరికి ఐటీ శాఖ కేటాయిస్తారని చర్చ జరుగుతున్న వేళ గతంలో ఐటీ మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అంతేకాదు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+