హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

lockdown effect:ఖాళీగా ప్రైవేట్ ఆస్పత్రులు, 95 శాతం తగ్గిన రోగులు, మరో 6 నెలలు...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావం ప్రైవేట్ ఆస్పత్రులపై తీవ్ర ప్రభావం చూపించింది. వైరస్ వల్ల ఇతరులు దవాఖానకు రావడం లేదు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగుల సామర్థ్యం భారీగా పడిపోయింది. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య 90 నుంచి 95 శాతానికి తగ్గింది. లాక్ డౌన్ విధించిన తొలుత అది 20 శాతం ఉండగా... ఇప్పుడు పీక్‌స్టేజీకి చేరిపోయింది.

4 నుంచి 6 నెలలు

4 నుంచి 6 నెలలు

ఆస్పత్రికి రోగులు రాకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. దీంతో తమ అనవసరపు ఖర్చులపై ఆస్పత్రి యజమాన్యాలు దృష్టిసారించాయి. దీంతో కొన్ని ఆస్పత్రి యజమాన్యాలు తమ భవన నిర్మాణ యజమానులతో చర్చలు జరుపుతున్నాయి. ఆస్పత్రులు నడవడం లేనందున అద్దె గురించి డిస్కస్ చేస్తున్నారు. ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తివేసిన 4 నుంచి 6 నెలల వరకు ఆస్పత్రికి వచ్చేందుకు జనాలు భయపడతారని భావిస్తున్నారు. సామాజిక దూరం పాటించాలని కోరడంతో.. ఆయా ఆస్పత్రుల్లో సగానికి పైగా బెడ్లు తగ్గిపోయే అవకాశం ఉంది.

 పెరిగిన ఖర్చులు

పెరిగిన ఖర్చులు

వైరస్ వల్ల హైదరాబాద్‌లో దాదాపు అన్ని ఆస్పత్రులు 24 గంటలు పనిచేస్తున్నాయి. మూడింట స్టాఫ్ కూడా పనిచేస్తున్నారు. అయితే అందరికీ తాము జీతాలు ఇవ్వాల్సి వస్తోంది. ఆస్పత్రికి రావాలి అని తాము ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు అని యజమాన్యాలు చెబుతున్నాయి. ఆస్పత్రికి వచ్చేవారికి రవాణా, ఆహారం, శానిటైజేషన్, గ్లౌజ్, మాస్క్, పీపీపీ కిట్ల అందజేస్తున్నామని తెలిపాయి. దీంతో తమ ఖర్చులు మరింత పెరుగుతున్నాయని కార్పొరేట్ ఆస్పత్రి ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆస్పత్రి ఖర్చు 50 నుంచి 80 శాతం పెరిగిందని.. ఔట్ పేషంట్ల సంఖ్య జీరోకి చేరడంతో 65 శాతం 70 శాతం రెవెన్యూ పడిపోతుందని మెడికవర్ ఆస్పత్రి ఈడీ హరికృష్ణ పేర్కొన్నారు.

 అంబులెన్స్‌లో మందులు

అంబులెన్స్‌లో మందులు

ఆస్పత్రి సిబ్బంది, రోగుల క్షేమం కోరి.. వీడియో కాన్పరెన్స్ ద్వారా కన్సల్టేషన్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్ ద్వారా సంబంధిత రోగులకు మందులు పంపిస్తున్నారు. లాక్ డౌన్ విధించడంతో ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య క్రమంగా తగ్గిపయిందని.. డయాగ్నొస్టిక్, కన్సల్టేషన్, సర్జరీ నిలిచిపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ తలకుమించిన భారం అవుతోందని కేర్ ఆస్పత్రి సీఓఓ రియాజ్ ఖాన్ తెలిపారు.

Recommended Video

Coronavirus Will Continue As A Part Of Human Life : AP CM Jagan

English summary
hospitals in Hyderabad reel under huge losses due to lockdown. 95 percent people are away to hospitals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X