తెలంగాణలో హాట్ టాపిక్.. ఆ నాలుగు స్థానాల్లో జోరుగా బెట్టింగ్

Recommended Video

    Lok Sabha Elections 2019 : తెలంగాణలో ఆ నాలుగు స్థానాల్లో జోరుగా బెట్టింగ్ || Oneindia Telugu

    తెలంగాణలో కీలకమైన పోలింగ్ ముగిసింది . కానీ కొన్ని స్థానాలపై తెలంగాణా రాజకీయ వర్గాల్లోనూ , తెలంగాణా ప్రజల్లోనూ ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా తెలంగాణలోని నాలుగు ఎంపీ స్థానాలపై జోరుగా పందేలు కాశారని తెలుస్తోంది. చేవెళ్ల, మల్కాజ్ గిరి, ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలపై లక్షలకు లక్షలు పందెం రాయుళ్లు బెట్టింగ్ పెడుతున్నారు .

    టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇస్తున్న ఆ నాలుగు స్థానాలపై బెట్టింగ్

    టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇస్తున్న ఆ నాలుగు స్థానాలపై బెట్టింగ్

    తెలంగాణలో ఎప్పుడూ ఊహించని విలక్షణ తీర్పునిచ్చే నియోజకవర్గంలో ఒకటైన మల్కాజ్ గిరిలోని కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిల విషయంలో విజయంపై జోరుగా బెట్టింగ్ పెట్టారని సమాచారం .మిగతా నియోజకవర్గాల అభ్యర్థుల కంటే కూడా రేవంత్ రెడ్డిపై పందెం కాయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలుకావటం , ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి కొత్త అభ్యర్థి బరిలోకి దిగటంతో రేవంత్ మీద చాలా మంది బెట్టింగ్ కట్టారు . చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై భారీగా పందేలు కాస్తున్నారు. చేవెళ్ళలో విశ్వేశ్వర్ రెడ్డి గెలుస్తారని ఎక్కువమంది బెట్టింగ్ పెట్టారు .

    ఖమ్మం , మహబూబాబాద్ లోనూ బెట్టింగ్ ... ఫలితాలపై ఉత్కంఠ

    ఖమ్మం , మహబూబాబాద్ లోనూ బెట్టింగ్ ... ఫలితాలపై ఉత్కంఠ

    ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి, టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై పెద్ద ఎత్తున పందేలు నడుస్తున్నాయి. ఇక్కడా కాంగ్రెస్ రేణుక వైపే బెట్టింగుల్లో మొగ్గు కనిపిస్తుందని తెలుస్తుంది. ఎస్టీ రిజర్వుడ్ స్థానం మహబూబాబాద్ సీటుపైనా బెట్టింగులు జోరుగాసాగుతున్నాయి. అక్కడ మొదట కాస్త డల్ గా అనిపించినా కాంగ్రెస్ కు పాజిటివ్ వాతావరణం ఉందనే కారణంతో బుకీలు ఈ సీటును పందేనికి తెచ్చినట్టు సమాచారం. ఇక్కడ రూ.లక్ష వరకు పందెం కాస్తున్నట్టు తెలిసింది. ఈ సీటుపై తొలుత ఎక్కువ మంది టీఆర్ఎస్ క్యాండిడేట్ మాలోత్ కవితపైనే పందేలు కాయగా, బుధవారం ఉదయంనుంచి కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ పైనా బెట్టింగ్లు పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

    మే 23 దాకా వేచి చూడాల్సిందే

    మే 23 దాకా వేచి చూడాల్సిందే

    తెలంగాణా రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో సాగిన పోలింగ్ పై కొన్ని స్థానాల్లో అభ్యర్థులపై బెట్టింగ్ పెట్టిన బెట్టింగ్ రాయుళ్లంతా ఫలితాల కోసం మే 23 వరకు వేచి చూడాల్సిందే. మరి రానున్న ఫలితాలు బెట్టింగ్ రాయుళ్ళకు ఎవరికి మోదాన్ని ఇస్తాయో.. ఎవరికి ఖేదాన్ని మిగులుస్తాయో వేచి చూడాలి .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+