వివస్త్రను చేసి నగ్నచిత్రాలు తీశాడు: పదే పదే రేప్ చేశాడు
Recommended Video

హైదరాబాద్: రిపేర్ చేయడానికని ఇంటికి వచ్చిన ఓ మెకానిక్ గృహిణణిపై మత్తుమందు చల్లి అత్యాచారం చేశాడు. ఆమెను నగ్నంగా సెల్‌ఫోన్‌లో చిత్రించి, వాటిని చూపిస్తూ బెదిరింపులకు పాల్పడి పదే పదే ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు.
అతని బెదిరింపులకు, చర్యలకు విసిగిపోయిన బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు హైదరాబాదులోని బాచుపల్ల పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.
ప్రగతినగర్‌కు చెందిన ఓ గృహిణి వాషింగ్ మిషన్ ఐదు నెలల క్రితం పాడైంది. దాంతో ఇంటర్నెట్‌లో గాలించి మియాపూర్‌లోని ఓ సర్వీసు సెంటర్‌కు ఫోన్ చేసింది. యజమానికి బదులు పవన్ తేజ్ రెడ్డి (24) ఫోన్‌లో మాట్లాడాడు.

ఇలా తాత్సారం చేస్తూ వచ్చాడు
ఆమె చెప్పిన అడ్రస్‌తో ఆమె ఇంటికి వెళ్లి నాలుగైదు రోజులు ఏమీ చేయకుండా కాలం వెళ్లదీస్తూ వచ్చాడు. మిషన్ బాగు చేసేందుకు అవసమైన వస్తువులను తెప్పించాలని చెప్పి వారం తర్వాత తిరిగి వచ్చాడు.

మత్తుమందు చల్లి ఫొటోలు తీశాడు
ఇంట్లో ఒంటరిగా ఆమెపై మత్తుమందు చల్లాడు. స్పృహ కోల్పోయిన ఆమెను వివస్త్రను చేశాడు. సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీశాడు. ఆ తర్వాత వాటిని చూపింంచి ఆమెపై అత్యాచారం చేశాడు.

బెదిరిస్తూ పదే పదే రేప్
ఆ తర్వాత కూడా అతను బెదిరిస్తూ అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఆమె నుంచి రూ.35 వేల నగదు కూడా తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా అతను ఆమె నగ్న చిత్రాలను మిత్రులకు చూపించాడు. ఆ విషయం బాధితురాలికి తెలిసింది.

చివరకు పోలీసులకు ఫిర్యాదు
అప్పటికే తీవ్రంగా విసిగిపోయిన ఆమె బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నెల 19వ తేదన పవన్ తేజ్ రెడ్డిని అరెస్టు చేశారు. అతన్ని న్యాయస్థానంలో ప్రవేశపెట్టి రిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications