Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Medaram: మేడారంకు ప్రత్యేక బస్సులు.. మహిళలకు ఫ్రీ ఉందా.. ఛార్జీలు ఎంతంటే..!

లక్షలాది మంది భక్తులు మేడారం జాతర కోసం చూస్తున్నారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క-సారక్క ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు భారీగా భక్తులు తరలొస్తారు. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. తాగునీరు, ఇతర ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ జాతరకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అయితే ఈ ప్రత్యేక బస్సుల ఛార్జీలు ఉంటాయా.. కామన్ ఛార్జీలు ఉంటాయా అని సందేహాలు తలెత్తాయి.

అలాగే ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఫ్రీ ఉంటుందా అని డౌట్లు వచ్చాయి. దీనిపై ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది. ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ ఉంటుందని స్పష్టం చేశారు. ఈసారి మేడారం జాతరకు 35 లక్షల మందిని తీసుకెళ్లాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 6 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. జాతర జరిగే ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు లక్షలాది మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

How much are the fares in RTC special buses going to Medaram?

తెలంగాణలోని 9 రీజియన్ల పరిధిలోని బస్సులను నడపనున్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్‍, హైదరాబాద్‍, రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్‍, నిజామాబాద్‍తో పాటు మహారాష్ట్ర నుంచి మొత్తం 51 పాయింట్ల ద్వారా ఈనెల 18 నుంచి పెంచిన ప్రత్యేక బస్సులు నడుతోన్నట్లు ఆర్టీసీ వివరించింది. గ్రేటర్‍ హైదరాబాద్‍ పరిధిలోని మూజు పాయింట్ల ద్వారా 2,650 బస్సులు నడపనున్నారు. ఈ నెల 20 నుంచి 25 వరకు ఇందులోని 2200 బస్సులను మేడారం జాతరకు వినియోగించనున్నట్లు అధికారులు చెప్పారు.

ఈసారి జాతరకు ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచారు. డీజిల్‍ ధరలు పెరగడంతో టిక్కెట్‍ రేట్లను కొంతవరకు పెంచాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు. గతంలో ఎక్స్​ప్రెస్​ బస్సుల్లో వరంగల్‍ నుంచి మేడారానికి ఒక్కొక్కరికి రూ.190 ఉంది. దాన్ని ఇప్పుడు రూ.60 పెంచి రూ.250కి చేశారు. అలాగే హైదరాబాద్‍ నుంచి ఒక్కొక్కరికి ఎక్స్​ ప్రెస్​ బస్సుల్లో రూ.440 ఉంది. దాన్ని రూ.550 చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+