ఎన్ కన్వెన్షన్ కూల్చడం వల్ల నాగార్జునకు ఎంత నష్టమో తెలుసా..?
టాలీవుడ్ హీరో నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. మాదాపూర్‌లోని తుమ్మిడి కుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్‌ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణంపైనా ఫిర్యాదుల వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. దీంతో, ఈ నిర్మాణం కు సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది.శనివారం ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించింది. తుమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రా గుర్తించింది.
దీంతో అక్రమ కట్టడం క్రింద ఆ భవనాన్ని కూల్చివేయడం జరిగింది. అయితే ఈ ఘటనపై నాగార్జున సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు. తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అక్రమ కట్టడం పేరుతో కూల్చివేయడాన్ని అక్కినేని నాగార్జున తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు హైడ్రా, తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలు తమను తప్పుగా అనుకోకుండా ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా చేసిన కూల్చివేతపై కోర్టులోనే తేల్చుకుంటానని నాగార్జున వెల్లడించారు.

స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అక్కినేని నాగార్జున తన ప్రకటనలో తెలిపారు.న్యాయపరంగా దీనిపై చర్యలు తీసుకుంటానని నాగార్జున స్పష్టం చేశారు.మరోవైపు ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చడం వల్ల నాగార్జునకు భారీగానే నష్టం చేకూరినట్టు తెలుస్తోంది. ఎన్ కన్వెన్షన్ మొత్తం విలువ 400 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. ఎన్ కన్వెన్షన్ ద్వారా నాగార్జునకు ఏడాదికి దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తోందని సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే నాగార్జున అధిక స్థాయిలోనే ఆదాయం కోల్పోయినట్టు అయింది.












Click it and Unblock the Notifications