అల్లు అర్జున్ కేసులో లాయర్ గంటకు ఎంత తీసుకున్నారో తెలుసా..?
తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆయన నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈక్రమంలో ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై ఎఫైర్ నమోదు కావడంతో చిక్కడపల్లి పోలీసులు ఆయన్ను హైదరాబాద్ నివాసంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది.
ఇక వైద్య పరీక్షలు అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ హైకోర్టు తలుపులు తట్టారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరుఫున లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. అల్లు అర్జున్ తరుఫున లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిరంజన్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిరంజన్ రెడ్డి గతంలో వైసీపీ అధినేత, మాజీ ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసును నిరంజన్ రెడ్డినే వాదించారు. ఆయన వైసీపీ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు.

హైకోర్టులో నిరంజన్ రెడ్డి లెవనెత్తిన పాయింట్లకు ప్రభుత్వ తరుఫున న్యాయవాది దగ్గర సమాధానం లేకండా పోయింది. ఈ కేసులో 11 నిందితుడుగా ఉన్న అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం దారుణమని నిరంజన్ రెడ్డి కోర్టుకు వివరించారు.ఇదే సమయంలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కేసును కూడా నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. షారుక్ ఖాన్ నటించిన రాయన్ సినిమా విడుదల సమయంలో కూడా ఓ అభిమాని మరణించారని, అయితే ఆ వ్యక్తి మరణానికి షారుక్ ఖాన్‌కు ఎటువంటి సంబంధం లేదని కోర్టు తెలిపింది.
షారుక్ ఖాన్ ఉద్దేశపూర్వకంగా చేయలేదని గుర్తించిన గుజరాత్ కోర్టు ఆయనకు క్లీన్ చీట్ ఇచ్చిందనే విషయాన్ని నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలియజేశారు. పుష్ప-2 విడుదల సమయంలో కూడా సరిగ్గా ఇదే జరిగిందని నిరంజన్ రెడ్డి కోర్టుకు వివరించారు. దీంతో న్యాయమూర్తి సైతం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒకరోజు కస్టడీ తీసుకుంటే సరిపోయేదానికి , అరెస్ట్ చేసే వరకు ఎందుకు వెళ్లారని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు. 4 వారాల మధ్యంతర బెయిల్‌తో పాటు, రూ.50 వేల పూచీకత్తుతో పర్సనల్ బాండ్ మీద విడుదల చేయడం జరిగింది.
ఇక కేసు వాదించినందుకుగానూ నిరంజన్ రెడ్డి భారీగానే చార్జ్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన గంటకు రూ. 5 లక్షలు చార్జ్ చేస్తాడనే పోస్ట్ ఒకటి ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ కేసును 2 గంటలు వాదించినందుకు గానూ ఆయన రూ.10 లక్షలకు పైగానే తీసుకుని ఉంటారని చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.












Click it and Unblock the Notifications