తెలంగాణ వాసులకు సౌదీ ‘పన్ను’ పోటు: 18ఏళ్లు దాటితే ఎవరికైనా..
తెలంగాణ నుంచి ఉపాధి కోసం సౌదీ బాటపట్టిన అనేకమంది ప్రవాసులకు అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను భారంగా మారనుంది.
హైదరాబాద్: తెలంగాణ నుంచి ఉపాధి కోసం సౌదీ బాటపట్టిన అనేకమంది ప్రవాసులకు అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను భారంగా మారనుంది. సౌదీ అరేబియాలో నివసిస్తున్న ఇతర దేశాల ఉద్యోగులు, కార్మికుల నుంచి పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. జులై 1 నుంచి అమలు కానున్న ఈ కుటుంబ పన్నుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం వెల్లడించింది.

18ఏళ్లు దాటితే..
ఈ పన్ను నిబంధనల ప్రకారం కుటుంబంలో తల్లిదండ్రులు, 18ఏళ్లు దాటిన యువకుల నుంచి పన్నులు చేస్తామని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే, కూతుళ్లు, 18ఏళ్లలోపు మగ పిల్లలకు కూడా పన్ను ఉండదని స్పష్టం చేసింది. ఒక్కో కుటుంబసభ్యుడిపైన నెలకు 100 సౌదీ రియాళ్లు(రూ. 1721) చొప్పున ఈ ఏడాది జులై నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు చెల్లించాల్సి ఉంటుంది.

పన్ను పోటు పెరుగుతూనే..
ఆ తర్వాత ఏటా ఈ పన్ను పెరుగుతూనే ఉంటుంది. 2018 జులై నుంచి ఒక్కొక్కరికి 200 రియాళ్లు, 2019 నుంచి 300 రియాళ్లు, 2020 నుంచి 400 రియాళ్లు చొప్పున చెల్లించాలని స్పష్టం చేసింది. సంవత్సర రుసుములు ఒకేసారి చెల్లించేందుకు కూడా వెసులుబాటు కల్పించినట్లు పేర్కొంది.

ఆందోళన
కాగా, సౌదీ ప్రభుత్వ నిర్ణయం పట్ల అక్కడ నివసిస్తున్న భారతీయులతోపాటు అన్ని దేశాలకు చెందిన ప్రవాసులు ఆందోళన చెందుతున్నారు. కుటుంబ పన్ను తమకు శరాఘాతమని వారు వాపోతున్నారు.

మిగిలేది ఆవేదనే
సౌదీలో ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకోవాలని ఇక్కడి వస్తే ఇక్కడి ప్రభుత్వం ఇలా పన్ను విధించడంతో తమకు మిగిలేదేమీ ఉండదని తెలంగాణకు చెందిన ప్రవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సౌదీలో తెలంగాణకు చెందిన వారు 2.10లక్షల మందికిపైగా ఉండగా, 42వేల కుటుంబాలున్నాయి.












Click it and Unblock the Notifications