కేసీఆర్ జాతిపిత ఎలా అవుతారు?

గత బీఆర్ఎస్ పాలనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వాసులు, కాకతీయ వర్సిటీ విద్యార్థులు కీలక పాత్ర పోషించారన్నారు.

వరంగల్ గడ్డపైనుంచి ఎన్నో పోరాటాలు జరిగాయన్నారు. వరంగల్ అభివృద్ధికి రూ. 6500 కోట్ల నిధులను కేటాయించినట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. రైల్వే కోచ్, ఔటర్ రిం్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విమానాశ్రయం వంటి మెగా ప్రాజెక్టుల ద్వారా హైదరాబాద్ తో సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

How will KCR become the Father of the Nation CM Revanth Reddy

కేసీఆర్ రూ. 8.29 లక్షల అప్పును మా నెత్తిన పెట్టిపోయారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసిన అప్పులకు ఒక్క ఏడాదిలోనే ఈ ప్రభుత్వం 84 వేల కోట్లు వడ్డీ, రూ. 6 వేల కోట్లు అసలు చెల్లించిందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నిఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని సీఎం చెప్పారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, ఇందుకోసం రూ. 5500 కోట్లు కేటాయించామన్నారు.

గ్రూప్ 1, 2,3 పరీక్షలను సవ్యంగా నిర్వహించి ఉద్యోగాలు ఇస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కడియం శ్రీహరి అవసరం ఉందని పార్టీకి తీసుకున్నామన్నారు. ఎమ్మెల్యేగా జీతభత్యాలు తీసుకుంటున్న వ్యక్తి.. తన బాధ్యతలను నెరవేర్చడం లేదంటూ కేసీఆర్‌పై మండిపడ్డారు.

15 నెలలుగా 50 లక్షలకుపైగా జీతభత్యాలు తీసుకుంటూ అసెంబ్లీ మాత్రం రావడం లేదని కేసీఆర్ నుద్దేశించి వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ చేసిన తప్పులను బయటపెడతామన్నారు. కేసీఆర్‌ను తెలంగాణ జాతిపిత అని అంటున్నారని.. ఆయన జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించారు. వందల ఎకరాల ఫాంహౌస్‌లు కట్టుకున్నోళ్లు జాతిపిత అవుతారా? తాగుబోతులు జాతిపిత అవుతారా? అని ప్రశ్నించారు. తెలంగాణ జాతిపిత అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్‌లు తెలంగాణకు జాతిపిత అవుతారని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+