Telangana Assembly Elections 2023: హైదరాబాద్ శివారులో భారీగా పట్టుబడిన డబ్బు..
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ శివారులో భారీగా నగదు పట్టుబడింది. తనిఖీల్లో రూ.6.5 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బండ్లగూడ అప్పా జంక్షన్ దగ్గర ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. లెక్కలు చూపని డబ్బును ఆరు కార్లలో తరలిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ డబ్బును ఎన్నికల కోసం తరలిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నగదు తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన నేతకు సంబంధించిన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా శనివారం పోలీస్ అథారటీ ద్వారా రూ. 14,75,715 సీజ్ చేయగా ఇప్పటివరకు రూ 51,54,43,673 నగదును స్వాధీనం చేసుకున్నారు. 9 ఎఫ్.ఐ.ఆర్ లునమోదు కాగా ఇప్పటి వరకు 764 కేసులు నమోదు చేశారు. లైసెన్స్ ఆయుధాలు 21 డిపాజిట్ చేయగా ఇప్పటి వరకు 4605 డిపాజిట్ చేశఆరు. సిఆర్పిసి 39 కింద ఇప్పటి వరకు 1271 కేసులు నమోదయ్యాయి. శనివారం 94 బైండోవర్ చేయగా ఇప్పటి వరకు 3439 బైండోవర్ చేశారు. 23 నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయగా.. ఇప్పటి వరకు 2343 నాన్ బెయిలబుల్ వారంట్ కేసులు నమోదు చేశారు.

ఎం.సి.సి కింద పబ్లిక్ ప్రాపర్టీస్ లో శనివారం 66 వాల్ రైటింగ్ లను తొలగించగా మొత్తం 6,254 వాల్ రైటింగ్ తొలగించారు. 2 బ్యానర్లను తొలగించగా ఇప్పటి వరకు మొత్తం 30119 బ్యానర్లను తొలగించారు. ప్రైవేట్ ప్రాపర్టీలలో శనివారం నేడు 2 పోస్టర్ తొలగించగా ఇప్పటి వరకు 21,616 పోస్టర్లను తొలగించారు. అనుమతి లేకుండా నిర్వహించిన ఓ సమావేశాన్ని అడ్డుకోగా.. ఇప్పటి వరకు అనుమతి 55 సమావేశాలను అడ్డుకున్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద సనత్ నగర్ ఒక కేసు నమోదయ్యాయి. స్టాటస్టిక్ సర్విలన్స్ టీం అంబర్పెట్ నియోజకవర్గం లో రూ. 21,00,000 నగదు ను సీజ్ చేశారు. ఎవరైనా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించరాదని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications