వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో స‌మూల మార్పులు..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ లో స‌మూల మార్పుల‌కు శ్రీ‌కారం జ‌ర‌గ‌బోతోంది. 31జిల్లాల‌కు కొత్త నాయ‌కత్వాన్ని ఏర్పాటు చేయ‌డంతో పాటు హైద‌రాబాద్, రంగా రెడ్డి జిల్లాల అద్య‌క్షుల‌ను కూడా మార్చ‌బోతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో పార్టీలో జ‌వ‌స‌త్తువ‌లు నింపేందుకు పార్టీ జాతీయ అద్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు క‌స‌రత్తు పూర్తి చేసారు. తెలంగాణ‌లో పార్టీని ప‌ట్టాలెక్కించి ప‌రుగులు పెట్టించేంద‌కు చంద్ర‌బాబు కొత్త నాయ‌క‌త్వాన్ని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. పాత జిల్లాల్లో ఇప్పుడున్న నాయ‌క‌త్వాన్ని మార్చి కొత్త‌జిల్లాల ప్ర‌కారం ప్ర‌క్షాళ‌న చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అందుకు త‌గ్గ జాబితాకు చంద్ర‌బాబు తుదిమెరుగులు దిద్దుతున్న‌ట్టు తెలుస్తోంది.

టీటిడిపి లో స‌మూల మార్పుల‌కు చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు..

టీటిడిపి లో స‌మూల మార్పుల‌కు చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు..

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మంచిరోజులు రాబోతున్నాయి. ఆ పార్టీ జాతీయ అద్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు తెలంగాణా నేత‌ల‌తో స‌మావేశ‌మై పార్టీ సంస్థాగ‌త బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించ‌బోతున్నారు. పార్టీ శ్రేణుల్లో భ‌రోసానింపుతూ కార్య‌క్ర‌మాల రూప‌క‌ల్ప‌న గురించి దిశానిర్దేశం చేయ‌నున్నారు బాబు. త్వ‌ర‌లో ఎన్టీఆర్ ట్ర‌స్తు భ‌వ‌న్ లో తెలంగాణా ముఖ్య నేత‌ల‌తో భేటీ నిర్వ‌హిస్తున్న బాబు భ‌విశ్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై త‌గు సూచ‌న‌లు చేయ‌నున్నారు. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ పునాదుల‌ను ప‌టిష్టం చేయాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైందిగా చంద్ర‌బాబు భావిస్తున్నారు. గ‌తమెప్పుడూ చ‌రిత్ర‌గా భావించే తెలుగుదేశం పార్టీ ఈ సారి మాత్రం గ‌తం గుణ‌పాఠంగా భావించాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. తెలంగాణాలో తిరుగులేని ఆదిక్యం నుండి ఉనికి కోల్సోయే ప‌రిస్థితికి దిగ‌జారిన ప‌రిణామాల‌ను విశ్లేషించుకోవాల్సిన సంద‌ర్బం కూడా వ‌చ్చేసింది.

 పార్ట‌కి న‌ష్టం చేకూరే వ్యాఖ్య‌లు చేస్తున్న నేత‌ల‌పై కఠిన చ‌ర్య‌లు

పార్ట‌కి న‌ష్టం చేకూరే వ్యాఖ్య‌లు చేస్తున్న నేత‌ల‌పై కఠిన చ‌ర్య‌లు

పార్టీలో శ్రేణులు బ‌లంగా ఉన్న‌ప్ప‌టికి వారి మ‌నోస్తైర్యాన్ని దెబ్బ‌తీసే విధంగా వినిపిస్తున్న వ్యాఖ్య‌ల‌కు త‌క్ష‌ణం అడ్డుక‌ట్ట వేయాలి. మొక్క‌వోని కార్య‌క‌ర్త‌ల ఆత్మ‌విశ్వాసాల‌కు అనుగుణంగా నాయ‌కుల నైజంలో మార్పు రావాల్సిన అవ‌స‌రం ఉంది. అందుకోసం పార్టీ అదినేత చంద్ర‌బాబు తెలంగాణా తెలుగుదేశం పార్టీ పైన ద్రుష్టి సారించి ప‌క‌డ్బందీ కార్యాచ‌ర‌ణ‌ రూపొందింల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్ప‌టివ‌ర‌కు ఒక లెక్క ఇప్ప‌టినుండి మ‌రో లెక్క అనే రీతిలో చంద్ర‌బాబు క్యాడ‌ర్ లో ఉత్తేజ‌పూరిత వాతావ‌ర‌ణం క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉత్ప‌న్న‌మైంది. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని అభివ్రుద్ది చేసిన అంశాలు, మిగులు బ‌డ్జెట్ సాధించిన ప్ర‌ణాళిక‌లు ఇప్పుడు పార్టీలో చ‌ర్చిండం అప్ర‌స్తుతం. అది చ‌రిత్ర‌. ఒక్కోసారి చ‌రిత్ర‌ను కూడా గుణ‌పాఠంగా మ‌లుచుకోవాల్సిన విప‌త్క‌ర ప‌రిస్థితులు త‌లెత్తుతాయి. ప్ర‌స్తుతం తెలంగాణా లో తెలుగుదేశం పార్టీ అలాంటి ప‌రిస్థితిలో ఉంది.

 కొత్త నాయ‌కత్వం కోసం చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు..

కొత్త నాయ‌కత్వం కోసం చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు..

తెలంగాణాలో గ్రామ క‌మిటీల ద‌గ్గ‌ర నుండి రాష్ట్ర క‌మిటీల వ‌ర‌కు చంద్ర‌బాబు ఆదేశాలు తూచా త‌ప్ప‌కుండా పాటించేట్టు జాగ్ర‌త్త‌లు తీసుకుంటే పార్టీకి మ‌ళ్లీ పున‌ర్వైభ‌వం వ‌స్తుంది. గ‌తాన్ని ప‌దే ప‌దే వ‌ల్లె వేసుకోవ‌డం కాకుండా భ‌విష్య‌త్తులో చేయ‌బోయే కార్య‌క్ర‌మాల గురించి స్ప‌ష్ట‌త ఇవ్వ‌గ‌ల‌గ‌డంతో పాటు ప్ర‌జ‌ల్లో నాయ‌కుల ప‌ట్ల విశ్వ‌స‌నీయ‌త క‌లించే దిశ‌గా కార్య‌చ‌ర‌ణ నిర్ధేశించుకుంటే తెలంగాణాలో పార్టీ బ‌లోపేతం ఖాయ‌మ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టెక్నాల‌జీతో ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ అయ్యే చంద్ర‌బాబుతో అన్ని జ‌న‌రేషన్లు అనుసంధానం అవ్వ‌డం తెలుగుదేశం పార్టీకి పెద్ద‌గా క‌లిసివ‌చ్చే అంశం. ఇదే అంశాన్ని తెలంగాణా ప్రజ‌ల్లోకి లోతుగా తీసుకెళ్ల‌గ‌లిగితే పార్టీ సంస్థాగ‌తంగా బ‌లోపేతం కావ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాక‌పోవ‌చ్చు. ఎప్పుడో ఒక‌సారి కాకుండా నెల‌కు రెండు సార్లు తెలంగాణా కోసం బాబు స‌మ‌యం కేటాయిస్తే పార్టీలో ఉత్సాహం నెల‌కొంటుంది. బాబు తెలంగాణాలో త‌రుచుగా నిర్వ‌హించే స‌మావేశాల ద్వారా యువ‌ర‌క్తం కూడా పార్టీలో చేరే అవ‌కాశాలు ఉంటాయి.

 యువ‌త‌కు అవ‌కాశాలిచ్చే దిశ‌గా చంద్ర‌బాబు అడుగులు..

యువ‌త‌కు అవ‌కాశాలిచ్చే దిశ‌గా చంద్ర‌బాబు అడుగులు..

చంద్ర‌బాబు అనుభ‌వానికి యువ‌ర‌క్తం తోడైతే తెలంగాణా లో ఊహించ‌ని స్థాయిలో పార్టీ బ‌లోపేతం అవుతుంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం తెలంగాణా లో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్ర‌జాకార్య‌క్ర‌మాలు మ‌రింత ప‌దును పెర‌గాలంటే చంద్ర‌బాబు ప్ర‌త్య‌క్ష జోక్యం ఎంతైనా అవ‌స‌రం ఉంది. చంద్ర‌బాబు తో జ‌ర‌గ‌బోయే తెలంగాణా నేత‌ల స‌మావేశం పార్టీలో నెల‌కొన్న నైరాశ్యాన్ని దూరం చేసే విధంగా ఉండాల‌న్న‌ది ప్ర‌తి కార్య‌కర్త ఆకాంక్ష‌గా తెలుస్తోంది. చంద్ర‌బాబు కూడా ఆ దిశ‌లోనే పార్టీకి నూత‌న ఉత్తేజాన్ని తీసుకొచ్చేందుకు త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స‌భతో నాంది పలుకుతార‌ని పార్టీ శ్రేణుల‌తో పాటు నాయ‌కులు భావిస్తున్నారు. గ‌తాన్ని చ‌రిత్ర లా కాకుండా గ‌ణ‌పాఠంగా భావించి చంద్ర‌బాబు ఉద్బోదించే కొత్త ప్ర‌ణాళిక‌ల ప‌ట్ల క్యాడ‌ర్ లో కూడా ఉత్సుక‌త మొద‌లైంది.

English summary
tdp national president chandrababu naidu re-sheduling the telangana tdp. appointing new leaders in the district level and hoping to strengthen the party. chandra babu wants to change the state level leaders in near future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X