హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎండ ఎఫెక్ట్: కాలిన బెంజ్, ప్రాణాలతో బయటపడ్డ మహిళ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎండ వేడిమికి అగ్ని ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఈ ఏడాది ఎండలు రికార్డ్ స్థాయిలో కనిపిస్తోన్న విషయం తెలిసిందే.

ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగినా మంటలు ఆర్పేందుకు.. ఎండ వేడిమి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే సమయంలో రోడ్డు పైన రాపిడి జరిగినా వాహనాలు మంటలకు కాలిపోతున్నాయి.

శనివారం నాడు ఓ కారులో ఒక్కసారిగా మంట‌లు ఎగిసి పడ్డాయి. వాటి నుంచి ఐదుగురు మ‌హిళ‌లు, ఓ చిన్నారి బయటపడ్డారు. మరోవైపు, గగన్‌పహాడ్‌ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ రసాయన గోదాములో చెలరేగిన మంటలతో రసాయన నిల్వలు దగ్ధమయ్యాయి.

కారు దగ్ధం

కారు దగ్ధం

శనివారం నాడు ఓ కారులో ఒక్కసారిగా మంట‌లు ఎగిసి పడ్డాయి. వాటి నుంచి మ‌హిళ‌లు, ఓ చిన్నారి బయటపడ్డారు.

కారు దగ్ధం

కారు దగ్ధం

వేగంగా వెళ్తున్న కారులో అక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దీనిని గుర్తించిన వెంటనే కారులో ఉన్న వారు వేగంగా బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు.

కారు దగ్ధం

కారు దగ్ధం

బెంజ్ కారులో నుంచి ప్రయాణించిన వారు బ‌య‌ట‌ప‌డిన క్ష‌ణాల్లోనే భారీ ఎత్తున ఎగిసి ప‌డిన మంట‌ల‌తో కారు పూర్తిగా ద‌గ్ధ‌మైంది.

గగన్ పహాడ్ ప్రమాదం

గగన్ పహాడ్ ప్రమాదం

గగన్‌పహాడ్‌ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ రసాయన గోదాములో చెలరేగిన మంటలతో రసాయన నిల్వలు దగ్ధమయ్యాయి. మంటలు భారీ ఎత్తున ఎగిసి పడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గగన్‌పహాడ్‌లోని ఓ మూతపడ్డ గోదాము ఆవరణలో యాసిడ్‌ తదితర రసాయనాలను నిల్వ ఉంచారు.

గగన్ పహాడ్ ప్రమాదం

గగన్ పహాడ్ ప్రమాదం

శనివారం మధ్యాహ్నం సమయంలో గోదాము పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చిన్నమంటలు చెలరేగాయి. క్రమేణా రసాయనాలకు అంటుకోవడంతో భారీగా వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకొన్నాయి. భరించలేని వాసనతో చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

గగన్ పహాడ్ ప్రమాదం

గగన్ పహాడ్ ప్రమాదం

మూడు గంటల పాటు ఎగిసి పడటంతో హైటెన్షన్‌ వైర్లకు మంటలు తాకాయి. ఒక విద్యుత్‌ వైరు తెగిపడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అధికారులు సుమారు నాలుగు గంటల పాటు సరఫరాను నిలిపివేశారు.

గగన్ పహాడ్ ప్రమాదం

గగన్ పహాడ్ ప్రమాదం

అగ్నిమాపకవాహనాలు చేరుకోవడంతో సుమారు మూడు గంటల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఇన్‌ఛార్జి ఉప కమిషనర్‌ దశరథ్‌ పరిశీలించారు.

English summary
Huge Fire Accident at Gaganpahad of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X