కర్ణాటక స్టైల్ 'టమాటో బాత్'.. ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోండి..!

టమాటో బాత్ అనగానే చాలామందికి నోరూరుతుంది. సాధారణ పద్దతిలో కాకుండా కర్ణాటక స్టైల్ లో టమాటో బాత్ చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో బాత్ ను ఇంట్లోనే సులభంగా చేసుకోవడమూ ఈజీనే. అయితే ఈ టమాటో బాత్ ను సులభంగా ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?

టమాటో బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే టమాటోలు 500 గ్రాములు, బొంబాయి రవ్వ రెండు కప్పులు, నూనె లేదా నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు రెండు పెద్దవి, కరివేపాకు ఒక రెబ్బ, పచ్చిమిర్చి మూడు లేదా నాలుగు, జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్, పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు లేదా మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ లు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా తీసుకోవాలి.

టమాటో బాత్ తయారీ విధానం చూస్తే.. ముందుగా టమాటోలను కడగాలి. సన్నని ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నెలో నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. అందులో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు, జీడిపప్పు వేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలోనే ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేంత వరకూ వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనే టమాటో ముక్కలు, ఉప్పు, గరం మసాలా వేయాలి.

TomatoBath Karnataka style home made Recipe Make This Tasty Dish Easily at Home with Ingredients

టమాటోలు మెత్తబడే వరకూ అలాగే మూతపెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో అవసరమైన నీటిని పోసి మరిగించుకోవాలి. నీరు మరిగిన తర్వాత అందులో వేయించిన బొంబాయి రవ్వను కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. చివరగా బాగా ఉడికించుకుని ఆ మిశ్రమంలో నిమ్మరసం, కొత్తిమీర చల్లుకోవాలి. అంతే సూపర్ టేస్టీ టమాటో బాత్ రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+