లింగ నిర్ధారణ రిపోర్టును బహిర్గతం చేస్తున్న ఆస్పత్రులు: ఒక్కో గర్భస్రావానికి రూ.20వేలు

Subscribe to Oneindia Telugu

ఖమ్మం: జిల్లాలో చాలామంది ఆడపిల్లంటేనే కడుపులోనే కరగదీస్తున్నారు. అందుకు కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు సహకరిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతీ సంవత్సరం 46వేల కాన్పులు జరుగుతున్నాయి. చాలా మంది నిబంధనలకు విరుద్దంగా ప్రైవేట్‌ ఆసుపత్రులు లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తున్నారు. అబార్షనకు రూ. 16వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేస్తున్నారు.

సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటనలు జిల్లా వైద్యశాఖ అధికారి ఎ.కొండల్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషనలో బయటపడ్డాయి. తమ శాఖలో పని చేసే కొందరు మహిళలతో స్టింగ్‌ ఆపరేషన చేయించారు. వారిని ప్రైవేట్‌ ఆసుపత్రులకు పంపి లింగ నిర్ధారణ పరీక్షలు చేయాలని కోరగా అందుకు ఆ పరీక్షలను చేశారు. తరువాత అబార్షన్‌ చేయాలని కోరగా అందుకు కూడా సదరు ఆసుపత్రుల యజమాన్యాలు అంగీకరించాయి.

చివరకు ఏడు నెలల గర్భిణులను అబార్షన్‌ చేయాలని పంపించగా, ఇప్పుడు అబార్షన్‌ చేస్తే ఇబ్బందవుతుందని, ఆడపిల్లను కంటే ఆ పాపను తాము ఇతరులకు విక్రయిస్తామని చెప్పాయి. ఈ విషయాలన్నీ వైద్య సిబ్బంది రికార్డు చేశారు. సదరు సీడీలను పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ఇక్బాల్‌కు డీఎంహెచవో కొండల్‌రావు అందజేశారు.

huge gender determination tests conducted in Khammam district

మంగళవారం ఆసుపత్రులపై పోలీసుల సహకారంతో దాడులు నిర్వహించి శ్రీశ్రీ, స్పందన (లీజ్‌కిచ్చిన భాగం), మీనాక్షి ఆస్పత్రులను సీజ్‌ చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ రిపోర్టులను బయటకు చెబుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్టు పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

ఖమ్మంలో మంగళవారం డీఎంహెచ్వో కొండల్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మీనాక్షి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో హెడ్‌ కాంపౌండర్‌ షేక్‌ గఫార్‌, శ్రీశ్రీ ఆస్పత్రి నిర్వాహకుడు సంపేట అశోక్‌, వైశ్య క్యూర్‌ మెడికల్‌ షాపునకు చెందిన అర్వపల్లి శ్రీనివాసరావును అరెస్టు చేశారు.

ప్రమాద వశాత్తు చెరువులోపడి మహిళ మృతి

జయశంకర్‌ భూపాలపల్లి: జయశంకర్‌ జిల్లా గణపురం మండల కేంద్రంలోని గణపమసుద్రం సరస్సులో పడి బుర్రకాయలగూడెం హరిజన కాలనీకి చెందిన బోగం తిరుపతమ్మ (48) ప్రమాదవశాత్తు మంగళవారం మృతి చెందింది. గేదెల కాపరిగా పని చేస్తున్న ఆమె గేదెలను నీటి కోసం చెరువు వద్దకు తీసుకువెళ్లింది. ఈ క్రమంలో ఆమె చెరువులో స్నానం చేసేందుకు వెళ్లింది. చెరువులో ఉన్న గుంతలో పడిపోయి మృతి చెందింది. వెంటనే ఎస్సై ప్రవీణ్‌ కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి భర్త కొమురయ్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

ఈవ్‌ టీజర్లకు కౌన్సెలింగ్‌

వరంగల్‌: నగరంలోని వివిధ ప్రాంతాల్లోని కళాశాలలు, షాపింగ్‌ మాల్స్‌ వద్ద ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడుతున్న 14 మంది యువకులకు క్రైం ఏసీపీ, షీం ఇంఛార్జి పూజ మంగళవారం మట్టెవాడ క్రైం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడే యువకులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కౌన్సెలింగ్‌లో మీర్జా అంజాద్‌ బేగ్‌, సంగారపు పున్నంరాజ్‌, చిన్నబోయిన అరుణ్‌, మేకల శ్రీకాంత్‌, సదా రాజు, గుర్రాల అభిలాష్‌, పోగు విక్రం, కొంగ బిక్షపతికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Huge gender determination tests conducted in Khammam district hospitals.
Please Wait while comments are loading...