తెలంగాణలో భారీ చోరీ.. 18 కేజీల బంగారం, 22 లక్షల నగదు మాయం
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన భారీ దోపిడీ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఎంజీ రోడ్డులోని 'సాయి సంతోషి జ్యూవెల్లర్స్' లో భారీ దోపిడీ జరిగింది. పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడిన దొంగల ముఠా.. ఏకంగా 18 కేజీల బంగారం.. రూ.22 లక్షల నగదును దోచుకెళ్లారు.
గోడకు రంధ్రం..
చోరీను ప్లాన్ చేసిన దొంగలు, ముందుగానే సీసీ కెమెరాలను డిస్ కనెక్ట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. షాపు వెనుక భాగంలోని గోడకు రంధ్రం చేసి.. అనంతరం గ్యాస్ కట్టర్ సాయంతో షట్టర్‌ను మనిషి దూకేంత వరకు కట్ చేసి లోపలికి ప్రవేశించారని తెలిపారు. అలానే స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న భారీ ఐరన్ తిజోరీని సైతం గ్యాస్ కట్టర్‌తో తెరిచి.. అందులో ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారన్నారు.

అయితే వెండి, ఇతర వస్తువులను ముట్టుకోకుండా కేవలం బంగారాన్ని తీసుకెళ్లినట్టు సమాచారం. దాదాపు రూ.17 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఈ చోరీ పక్కా మాస్టర్ ప్లాన్‌తో సాగిందని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ చోరీ ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరగగా.. శనివారం షాపు మూసి ఉండడం, ఆదివారం సెలవు కావడంతో.. తిరిగి సోమవారం ఉదయం షాపు తెరిచి చూడగా విషయం వెలుగులోకి వచ్చినట్టు చెబుతున్నారు. స్ట్రాంగ్‌రూమ్ గోడకు రంధ్రం వేసి ఉండడం.. షాపులో ఫర్నిచర్, మొత్తం వస్తువులను కదిలించినట్టు షాపు యజమాని తెడ్ల కిషోర్ వాపోయారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ ప్రసన్న కుమార్ నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించారు. ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

ఇక మరోవైపు తెలంగాణలో కూడా ఈ తరహా దొంగతనాలు వరుసగా జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని 'కోహినూర్ జ్యూవెల్లర్స్'లో సుమారు రూ.15 కోట్ల విలువైన వజ్రాభరణాలను అపహరించారు. అలానే మార్చిలో నాగర్‌కర్నూల్ జిల్లాలో ATMను గ్యాస్ కట్టర్‌తో తెరిచి రూ.50 లక్షల నగదు దోచుకెళ్లారు. దీంతో ఈ వరుస దొంగతనాల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications